- Advertisement -
నవతెలంగాణ – మోర్తాడ్
సమండలంలోని సహకార సంఘాలలో రైతులకు అవసరమేరకు యూరియా అందుబాటులో ఉందని వ్యవసాయ శాఖ అధికారి హరీష్ తెలిపారు. గురువారం మండలంలోని షట్ పెళ్లి మోర్తాడ్ సొసైటీలను ఆయన పరిశీలించారు. యూరియా కొడతా ఉందని రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రైతు అవసరాలకు సరిపడే విధంగా యూరియాను అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. రైతులు సైతం తమకు సహకరించి అవసరానికి మించి యూరియా తీసుకొని కృత్రిమ కొరత సృష్టించవద్దని తెలిపారు. ఇప్పటివరకు మండలానికి 2205 మెట్రిక్ టన్నుల యూరియా రావడం జరిగిందని తెలిపారు.
- Advertisement -