Thursday, September 4, 2025
E-PAPER
spot_img
Homeఆదిలాబాద్సిర్పూర్ ఉన్నత పాఠశాలలోనే పిల్లలను చేర్పించండి

సిర్పూర్ ఉన్నత పాఠశాలలోనే పిల్లలను చేర్పించండి

- Advertisement -

నవతెలంగాణ మోపాల్

మోపాల్ మండలంలోని సిర్పూర్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయ బృందం శుక్రవారం బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ

ఈ సంవత్సరం పదవ తరగతి లో వంద శాతం ఫలితాలు సాధించిన మరియు గత సంవత్సరం లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బహుమతులు సాధించిన సిర్పూర్ ఉన్నత పాఠశాల లోనే తమ పిల్లలను చేర్పించాలని, విద్యార్థుల తల్లిదండ్రులకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి.సత్యనారాయణ పిలుపునిచ్చారు. ప్రధానోపాధ్యాయులు ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు గ్రామంలో ఇల్లిల్లు తిరగడం తో పాటు ఉపాధిహామీ లో పనులను చేస్తున్న తలిదండ్రుల దగ్గరకు వెళ్ళి మరీ బడిబాట ను నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మోహన్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad