– మొక్కజొన్న పంట ఎండిపోయే పరిస్థితి ఉంది
– పడగల్ గ్రామంలో కరెంట్ సమస్య ను పరిష్కరించండి
– ఎలక్ట్రిసిటీ ఎస్ఈ తో ఫోన్ లో మాట్లాడిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
నవతెలంగాణ – కమ్మర్ పల్లి
వేల్పూర్ మండలం పడగల్ గ్రామంలో సాగుకు కరెంట్ సరఫరా సమస్యతో పంటలు ఎండిపోయే పరిస్థితి ఉందని, సమస్యను వెంటనే పరిష్కరించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ట్రాన్స్ కో అధికారులను కోరారు. గ్రామంలో కరెంటు సమస్యలతో మొక్కజొన్న పంట ఎండిపోయే పరిస్థితి ఉందని రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో సోమవారం ఆయన ఎలక్ట్రిసిటి ఎస్ఈ తో ఫోన్ లో మాట్లాడారు.
మూడు రోజుల క్రితం గ్రామంలో పంటలకు అసలు కరెంట్ లేదని, అలాగే గత రెండు రోజులుగా ఒక వైపు ఆరు గంటలు, మరో వైపు ఆరు గంటలు కరెంట్ ఇస్తున్నారన్నారు.దీనివల్ల పంటలకు నీరు సరిగ్గా అందక మొక్కజొన్న పంట ఎండిపోయే ప్రమాదం ఉంది అని ఎమ్మెల్యే ఎస్ఈ దృష్టికి తీసుకెళ్లారు.రైతులందరు సబ్ స్టేషన్ వెళ్లి అధికారులను అడిగితే లో ఓల్టేజ్ సమస్య ఉందని చెప్పినట్లు ఆయన తెలిపారు. మూడు కెపాసిటర్ సేల్స్, నాలుగు బ్యాటరీలు ఉంటే సమస్య పరిష్కారం అవుతుందని చెబుతున్నారన్నారు. వెంటనే మెటీరియల్ సప్లై చేసి కరెంట్ సమస్య త్వరితగతిన పరిష్కరించి రైతులకు కరెంట్ ఇబ్బంది లేకుండా చూడాలని ఎస్ఈ ని ఎమ్మెల్యే ఆదేశించారు.
రైతులకు ఇబ్బంది కాకుండా చూడండి: ఎమ్మెల్యే వేముల
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES