Tuesday, July 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పరిసర ప్రాంతాల్లో నీరు నిలవకుండా చూసుకోవాలి

పరిసర ప్రాంతాల్లో నీరు నిలవకుండా చూసుకోవాలి

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్
ఇంటి చుట్టూ పరిసర ప్రాంతాలలో నీరు నిలవకుండా చూసుకోవాలని మెడికల్ అధికారి యేమిమా గ్రామ ప్రజలకు సూచించారు. మంగళవారం మండలంలోని ఆయా గ్రామాలలో వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు ప్రతి ఇంటికి వెళ్లి నీరు నిల్వ ఉన్న పాత్రలలో నీటి పారబోసి పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండే విధంగా చూసుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించారు. మలేరియా, డెంగ్యూ వ్యాధి గురించి అవగాహన కల్పిస్తూ సూచనలు, సలహాలు అందజేశారు.

సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన..
మంగళవారం పట్టణ కేంద్రంలోని ఐకెపి కార్యాలయంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో మహిళా సభ్యులకి సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కార్యక్రమాన్ని మెడికల్ అధికారి దివ్య నిర్వహించారు. ఇంటి పరిసరాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేశారు. మహిళా సంఘం సభ్యులకు హిమోగ్లోబిన్ శాతం పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం శ్రీనివాస్, హెచ్ ఈ ఓ వెంకటరమణ, సూపర్వైజర్ సువర్ణ, హెల్త్ అసిస్టెంట్ మాధవి, స్టాఫ్ నర్స్, వైద్య సిబ్బంది, మహిళా సంఘం సభ్యులు, తదితరులు ఉన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -