– కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
ముఖ్యమంత్రి ఆర్థిక సహాయ నిధులతో పేదల వైద్యానికి భరోసా లభిస్తుందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి అన్నారు. సోమవారం మండల కేంద్రానికి చెందిన లబ్ధిదారులు నూకల లక్ష్మీ రూ.19వేల500, సుంకెట గణేష్ రూ.24వేల500, పత్రి లక్ష్మి రూ.36వేల ఆర్థిక సహాయం చెక్కులను ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు చేసింది. అట్టి చెక్కులను స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా సుంకేట రవి మాట్లాడుతూ ఎంతోమంది పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరు చేసే ఆర్థిక సహాయం చెక్కులు వైద్యానికి భరోసా నిస్తున్నాయన్నారు. ఆర్థిక సహాయం చెప్పుల మంజూరుకు గురిచేసిన బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ముత్యాల సునీల్ కుమార్ కు లబ్ధిదారుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సల్లూరి గణేష్ గౌడ్, సీనియర్ నాయకులు నూకల బుచ్చి మల్లయ్య, బుచ్చి నిమ్మ రాజేంద్రప్రసాద్, నాయకులు సింగిరెడ్డి శేఖర్, దూలూరి కిషన్ గౌడ్, ఉట్లూరి నరేందర్, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి సహాయ నిధితో పేదల వైద్యానికి భరోసా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



