Monday, December 8, 2025
E-PAPER
Homeసినిమాఆద్యంతం వినోదభరితం

ఆద్యంతం వినోదభరితం

- Advertisement -

రవితేజ, కిషోర్‌ తిరుమల కాంబోలో వస్తున్న అవుట్‌ అండ్‌ అవుట్‌ ఎంటర్‌టైనర్‌ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. ఎస్‌ఎల్‌వి సినిమాస్‌ బ్యానర్‌పై సుధాకర్‌ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
జీ స్టూడియోస్‌ సమర్పిస్తోంది. ఇందులో రవితేజ సరసన ఆషికా రంగనాథ్‌, డింపుల్‌ హయతి కథానాయికలుగా నటిస్తున్నారు.
బ్లాక్‌ బస్టర్‌ ఫస్ట్‌ సింగిల్‌ ‘బెల్లాబెల్లా..’తో మ్యూజిక్‌ ప్రమోషన్‌లను స్టార్‌ చేసిన మేకర్స్‌ ఇప్పుడు సెకండ్‌ సింగిల్‌ అప్డేట్‌ ఇచారు. సెకండ్‌ సింగిల్‌ ‘అద్దం ముందు..’ను ఈనెల 10న రిలీజ్‌ చేయబోతున్నారు.
రవితేజ, డింపుల్‌ హయతిపై చిత్రీకరించిన ఈ సాంగ్‌ అదిరిపోయే మెలోడీ డ్యూయెట్‌. మేకర్స్‌ రిలీజ్‌ చేసిన ప్రోమోలో రవితేజ, డింపుల్‌ హయతి కెమిస్ట్రీ చూడముచ్చటగా ఉంది. ఫుల్‌ సాంగ్‌ పై అంచనాలు పెంచింది. ఈ సినిమా 2026 సంక్రాంతికి విడుదల కానుంది.
రవితేజ, ఆషికా రంగనాథ్‌, డింపుల్‌ హయతి నాయకానాయికలుగా నటిస్తున్న ఈచిత్రానికి రచన, దర్శకత్వం: కిషోర్‌ తిరుమల, నిర్మాత: సుధాకర్‌ చెరుకూరి
డీఓపీ : ప్రసాద్‌ మురెళ్ల, సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో, ఎడిటర్‌: శ్రీకర్‌ ప్రసాద్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: ఎ.ఎస్‌.ప్రకాష్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: విజరు కుమార్‌ చాగంటి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -