చిరంజీవి, నయనతార జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అర్చన సమర్పిస్తున్నారు.
‘తాజాగా కేరళలో మూడవ షెడ్యూల్ పూర్తి చేశాం. ఈ షెడ్యూల్‌లో బ్యూటీఫుల్ సాంగ్‌తో పాటు కీలకమైన టాకీ పోర్షన్స్‌ని చిత్రీకరణ చేశాం. సాంగ్, సీన్స్ చాలా అద్భుతంగా వచ్చాయి’ అని చిత్ర యూనిట్ తెలిపింది.
మూడవ షెడ్యూల్ పూర్తి చేసుకున్న సందర్భంగా చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి ప్రైవేట్ జెట్ ముందు నిలబడి చిరునవ్వుతో కనిపించిన ఫోటోని మేకర్స్ షేర్ చేశారు. ఇటీవల రిలీజ్ చేసిన ప్రోమోలో చిరంజీవి వింటేజ్, స్టైలిష్ లుక్‌లో అలరించారు. దర్శకుడు అనిల్ రావిపూడి స్టైల్‌కి తగ్గట్టుగా చిత్రీకరణ జెట్ స్పీడుగా, ప్లాన్డ్‌గా జరుగుతోంది. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది.
‘ఈ సినిమాలో చిరంజీవి, నయనతార పాత్రలు మిమ్మల్ని కచ్చితంగా సర్‌ప్రైజ్ చేస్తాయి. ఈ పాత్రల్ని దర్శకుడు అనిల్ రావిపూడి డిజైన్ చేసిన తీరుని ప్రశంసిస్తారు. అలాగే ఆయన చాలా ఫ్లాన్డ్‌గా చిత్రీకరణ చేస్తున్నారు. ఆయన సినిమాల్లో ఉండే వినోదానికి మించి ఈ సినిమాలో ఉండేలా స్క్రిప్ట్‌ని రూపొందించారు. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులతోపాటు చిరు అభిమానులకు ఫుల్ ట్రీట్ ఇచ్చేలా ఉంటుంది’ అని మేకర్స్ తెలిపారు.
ఈ చిత్రానికి రచన, దర్శకత్వం – అనిల్ రావిపూడి, సంగీతం – భీమ్స్ సిసిరోలియో, డీవోపీ – సమీర్ రెడ్డి, ప్రొడక్షన్ డిజైనర్ – ఎ.ఎస్.ప్రకాష్, ఎడిటర్ – తమ్మిరాజు, రచయితలు – ఎస్ కష్ణ, జి ఆదినారాయణ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – ఎస్.కష్ణ, లైన్ ప్రొడ్యూసర్ – నవీన్ గారపాటి, అడిషినల్ డైలాగ్స్ – అజ్జు మహంకాళి, తిరుమల నాగ్.
అంతకుమించి వినోదం..
- Advertisement -
- Advertisement -