డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద విజయ్ పాల్ రెడ్డి అడిదెల నిర్మించిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఈనెల 29న ఆడియెన్స్ ముందుకు రానుంది.
ఈ సందర్భంగా దర్శకుడు మోహన్ శ్రీవత్స మీడియాతో మాట్లాడుతూ, ‘బార్బరికుడు త్రిబాణంతో కురుక్షేత్రంను ఆపగలరు. అలాంటి బార్బరికుడిని కృష్ణుడు ఓ వరం అడిగి యుద్దాన్ని జరిగేలా చేస్తారు. నార్త్‌లో బార్బరికుడికి ఫాలోయింగ్ చాలా ఉంటుంది. సత్య రాజ్ బార్బరికుడిలా కొన్ని చోట్ల కనిపిస్తారు. ఈ కథలో చాలా లేయర్స్ ఉంటాయి. ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలకే మైథలాజికల్ టచ్ ఇచ్చాను. ఇందులో ఉదయభాను, వశిష్ట ..ఇలా అందరూ అద్భుతంగా నటించారు. ఇన్ ఫ్యూజన్ బ్యాండ్‌తో నాకు మంచి బంధం ఉంది. మాకు అద్భుతమైన పాటలు ఇచ్చారు. ఆర్‌ఆర్ కూడా అదిరిపోతుంది. మా నిర్మాత విజయ్ ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా మాకు అండగా నిలిచారు. ఇక దర్శకుడు మారుతి మొదటి నుంచి బాగా సపోర్ట్ చేశారు. ఈ చిత్రంలో హీరో, విలన్ అని ఉండరు. అన్ని పాత్రల్లో అన్ని యాంగిల్స్ ఉంటాయి. అన్ని పాత్రల్లోనూ అంతర్గత యుద్దం జరుగుతుంటుంది. తెలిసో తెలియకో అందరం తప్పులు చేస్తుంటాం. అన్ని ఎమోషన్స్‌ను కంట్రోల్‌లో పెట్టుకునే వాడు గొప్ప మనిషి అనే సందేశం ఇస్తున్నాం. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా అందరినీ అలరించేలా మా చిత్రం ఉంటుంది’ అని అన్నారు.
అన్ని వర్గాల వారిని అలరిస్తుంది
- Advertisement -
- Advertisement -