– 13న ఉప్పల్ స్టేడియంలో ‘మెస్సి- గోట్ ఫుట్‌బాల్ మ్యాచ్’ : రాచకొండ సీపీ సుధీర్‌బాబు
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఈ నెల 13న ఉప్పల్ స్టేడియంలో ‘మెస్సి- గోట్ ఫుట్ బాల్ మ్యాచ్’కు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని రాచకొండ సీపీ సుధీర్‌బాబు తెలిపారు. బుధవారం రాచకొండ కమిషనరేట్ ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మెస్సి జట్ల మధ్య జరగబోయే ‘మెస్సి- గోట్ ఫుట్‌బాల్ మ్యాచ్’కు భారీగా క్రీడా అభిమానులు తరలివచ్చే అవకాశముందని అభిప్రాయపడ్డారు.
ఈ నేపథ్యంలో ఉప్పల్ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోవుంటాయని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని సీపీ తెలిపారు. టికెట్, పాసులు ఉన్న వారు మాత్రమే స్టేడియం వద్దకు రావాలని, అవి లేని వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఉండదని చెప్పారు. ఇందుకు నగరవాసులు, అభిమానులు సహకరించాలని సీపీ కోరారు.
పాసులుంటేనే ఎంట్రీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



