– అమ్మ పేరిట మొక్క నాటిన విద్యార్ధులు
– ప్రశంసా పత్రాలు అందజేశారు
నవతెలంగాణ – అశ్వారావుపేట
వన మహోత్సవంలో భాగంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు విద్యార్ధులచే అమ్మ పేరిట ఒక మొక్క (ఏక్ ఫేడ్ పర్ మాకే నామ్ )నినాదంతో విద్యార్ధులచే మొక్కలు నాటించే కార్యక్రమాన్ని అశ్వారావుపేట జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో యాంత్రిక జీవనంలో పర్యావరణం పేరిట విద్యార్ధులు చే శనివారం మొక్కలు పాటించారు.
ఈ సందర్భంగా హెచ్ ఎం హరిత మాట్లాడుతూ.. విద్యాసంవత్సరం లో అనేక మొక్కలు విద్యార్ధులు నాటారు అని వాటిని సంరక్షించేందుకు కూడా ప్రణాళిక రూపొందించామని, అమ్మ పేరిట నాటిన మొక్క భూమాతకు రక్షణ కవచం అవుతుంది అన్నారు. స్థానిక జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలోని విద్యార్ధులు మొక్కలు నాటిన వివరాలను ఫోటోతో సహా ఆన్లైన్ లో పొందు పర్చగా ఎకో క్లబ్ ఫర్ మిషన్ లైఫ్ వారు పంపిన ప్రశంసా పత్రాలను శనివారం జరిగిన ఎకో క్లబ్ సమావేశంలో విద్యార్ధులకు అందించారు. విద్యార్ధులకు ఈ ప్రశంసా పత్రాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో సి.ఆర్.పి ప్రభాకరాచార్యులు, పాఠశాల ఉపాధ్యాయులు నర్సింహారావు,ఊడల కిశోర్ బాబు, కట్టా శ్రీను పూర్ణ చంద్ర రావు, దుర్గయ్య పాఠశాల ఎకో క్లబ్ ఇంచార్జి మధుబాబు పాల్గొన్నారు.