నవతెలంగాణ – (వేల్పూర్) ఆర్మూర్
మండలంలోని జడ్పిహెచ్ఎస్ అంక్సాపూర్ పాఠశాలలు గణపతి నవరాత్రుల సందర్భంగా పాఠశాలలో మట్టి వినాయకుని తయారుచేసి దానిపైన వివిధ రకాల విత్తనాలను అలంకరించడం చూపర్లను ఎంతో ఆకట్టుకుంది. విత్తనాలలో పెసర్లు మినుములు కందిపప్పు పెసరపప్పు కేసరి పప్పు మొక్క జొన్నలు ఆవాలు మెంతులు సజ్జలు జొన్నలు అలంకరించడం జరిగింది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రకృతిని కాపాడడానికి బంకమట్టితో తయారుచేసి ఈ విధంగా విత్తనాలతో అలంకరించడం జరిగింది. ఈ విగ్రహాన్ని తొమ్మిది రోజుల అనంతరం సమీప చెరువులో నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఈ విధంగా మట్టి గణపతి చెరువులో నిమజ్జనం చేయడం వల్ల నీరు కలిసితం కాకుండా కాపాడబడుతుంది. అంతేకాకుండా నీరు శుద్ధ గుణం మరియు ఈ విగ్రహానికి అద్దిన వివిధ రకాల విత్తనాలు చెరులో గల వివిధ రకాల నీటి జీవాలకు ఆహారంగా ఉంటుందని, ఈ సందర్భంగా పాఠశాల జిహెచ్ఎం ఆర్ మల్లీశ్వరి అన్నారు. ఎన్జీసీలో భాగంగా పాఠశాలలు విద్యార్థుల చేత మట్టి వినాయకులను తయారుచేసి పంపిణీ చేయడం జరిగిందని ఇన్చార్జి ఉపాధ్యాయులు పి రఘునాథ్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని పాఠశాల ఉపాధ్యాయ బృందం , విద్యార్థిని విద్యార్థులు విజయవంతం చేయడం జరిగింది.
అంక్సాపూర్ జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో పర్యావరణ గణపతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES