Wednesday, November 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రాజ్యాంగ స్ఫూర్తితోనే అందరికీ సమాన అవకాశాలు: బర్రె జహంగీర్

రాజ్యాంగ స్ఫూర్తితోనే అందరికీ సమాన అవకాశాలు: బర్రె జహంగీర్

- Advertisement -

భువనగిరి జిల్లా కేంద్రంలో ఘ‌నంగా రాజ్యాంగ దినోత్స‌వ వేడుక‌లు
నవతెలంగాణ – భువనగిరి

భారతదేశంలో ఎలాంటి వివక్షతకు తావులేకుండా అందరికీ అన్ని రంగాల్లో సమాన అవకాశాలు వస్తున్నాయంటే అది రాజ్యాంగం గొప్పతనమే అని దళిత సంఘాల నాయకులు, బర్రె జహంగీర్ భువనగిరి మాజీ మున్సిపల్ చైర్మన్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను బాబు జగ్జీవన్ రామ్ చౌరస్తా వద్ద నుండి బాబాసాహెబ్ అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు  అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విభిన్న సంస్కృతులు, జాతులు, భాషలు, ప్రాంతాలు కలిగిన భారతదేశానికి అత్యున్నత లిఖిత పూర్వక  రాజ్యాంగాన్ని అందించి అనేక అసమానతలు రూపు మాపడానికి కృషి చేసిన గొప్ప దార్శనికుడు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు. అతి పెద్ద ప్రజాస్వామ్య సార్వసత్తాక లౌకిక ప్రజాస్వామ్య దేశమైనా భారతదేశంలో మన రాజ్యాంగానికి ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు.

అందరిని సమానంగా చూడాలి, సమాన అవకాశాలివ్వాలి, ఎవరికయినా ప్రశ్నించే హక్కు ఉంటుందని, ఎవరైనా రాజకీయాల్లోకి వచ్చి అధికారం పొందవచ్చన్నారు. కానీ నేడు కొన్ని పాలకవర్గాలు బాబా సాహెబ్ అంబేద్కర్ నామస్మరణ లేకుండా ఆయన రాజ్యాంగాన్ని రూపుమాపడం కోసం ఆయన కన్న కలలను నిర్విరారం చేయుటకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే ప్రభుత్వ పబ్లిక్ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తూ కార్పొరేట్లకు ఈ దేశాన్ని ధారా దత్తం చేయడం కోసం ప్రయత్నిస్తున్నారు కావున అంబేద్కర్ ఆలోచన విధానాలు ముందుకు తీసుకుపోయే ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా భారత రాజ్యాంగ పీఠికను ప్రమాణం చేస్తూ విజ్ఞానాన్ని పేద ప్రజలలో పెంపొందించుతూ భారత ప్రజాస్వామ్య రాజ్యాంగ ఫలాలు ప్రతి భారతీయుడికి అందిననాడే డాక్టర్ అంబేద్కర్ కు నిజమైన నివాళి అన్నారు.

ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు ప్రజాసంఘాల నాయకులు గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎండి అవేస్ చిస్తీ, మాజీ మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, ఎనబోయిన ఆంజనేయులు, పెంట నరసింహ, కొలుపుల అమరేందర్, దళిత ఐక్యవేదిక నాయకులు బట్టు రామచంద్రయ్య, నాగారం అంజయ్య, బర్రె సుదర్శన్, కర్తల శ్రీనివాస్, ఈరపాక నరసింహ, పడిగెల ప్రదీప్, ఎండి లయక్ అహ్మద్, వెంకట్ నర్సింగ్, ఇటుకల దేవేందర్ మాదిగ, కానుకుంట్ల కోటి రమేష్, నాగారం శంకర్, బర్రె ప్రమీల, గ్యాస్ చిన్న, సిరుపంగ సుభాష్, తదితరులు పాల్గొని అంబేద్కర్ కు నివాళులర్పించి రాజ్యాంగ పీఠికను చదివి ప్రమాణం చేశారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -