Tuesday, August 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అంగన్వాడీలకు పరికరాలు.!

అంగన్వాడీలకు పరికరాలు.!

- Advertisement -

చిన్నారుల భద్రతకు ప్రత్యేక చర్యలు
మండలంలో 38 కేంద్రాలు
1,273 మంది విద్యార్థులు
బలోపేతం కానున్న ఫ్రీ స్కూల్ విద్య
నవతెలంగాణ – మల్హర్  రావు

అంగన్వాడీలను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.ఇందులో భాగంగా కేంద్రాల్లోని చిన్నారులను ఆకట్టుకునే విధంగా పలు రకాల వసతుల కల్పనకు పెద్దపీట వేసింది. ఈ మేరకు కేంద్రాలకు 60 రకాల పరికరాలు,రంగు రంగుల మ్యాట్లు,టేబుళ్లు పం పిణీ చేసింది. కేంద్రాల్లో ఫ్రీ స్కూల్ విద్యా విధానాన్ని మెరుగుపరిచే దిశగా మాతా, శిశు సంక్షేమశాఖ కృషి చేస్తుంది.

మండల పరిధిలో 15 గ్రామాల్లో మొత్తం 38 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వీటిలో 1273 పైచిలుకు విద్యార్థులున్నారు.కేంద్రాల్లో సరైన సదుపాయాలు లేక చిన్నారులు ఇబ్బందులపాలవు తున్నారు. అపరిశుభ్ర వాతావరణంలో నేలపై కూర్చొని ఆహారం తీసుకుంటున్నారు. దీంతో వ్యాధుల బారిన పడే అవకాశాలు ఉండటంతో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. అన్ని కేంద్రాలకు మౌలిక సదుపాయాలు కల్పించి, వాటిని బలో పేతం చేసే దిశగా కృషి చేస్తుంది. ఇందులో భాగంగా మండల పరిధిలోని అన్ని కేంద్రాలకు రంగు రంగుల మ్యాట్లతో పాటు టేబుళ్లు, ఫ్రీ స్కూల్ కిట్లు, పుస్త కాలు పెట్టుకోవడానికి వీలుగా ర్యాక్లతో పాటు 60 రకాల పరికరాలు పంపిణీ చేశారు.

కేంద్రాల్లోని చిన్నారులను మ్యాట్లపై కూర్చొబెట్టి చదువు చెబుతు న్నారు. వారు ఒకే చోట కూర్చొని అల్పాహారం చేసే లా ప్రత్యేకంగా ప్రతి కేంద్రానికి రెండు టేబుళ్లు సరఫరా చేశారు. స్కూల్ కిట్ లో కథలకు సంబంధించి చిన్న చిన్న బొమ్మల పుస్తకాలతో పాటు ఆటలు ఆడు కోవడానికి వీలుగా సామగ్రి అందించారు. పుస్తకాల ర్యాక్, నాలుగు ప్రియదర్శిని పుస్తకాలు, బ్లూటూత్, ఫజిల్స్, వివిధ చార్టులు, వాటర్ కలర్స్ బ్రష్లతో పాటు పలు రకాల పండ్ల బొమ్మలు అందజేశారు.చిన్నారులను నేలపై కాకుండా మ్యాట్లపై మాత్రమే కూర్చొబెట్టాలని అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కాగా తాము కేంద్రాలకు మంజూరు చేసిన పరికరాలు వినియోగిస్తున్నారా..? లేదా అనే విషయమై పర్యవేక్షించేందుకు మ్యాట్లపై చిన్నారు లను ఉంచి ప్రతి రోజు యాప్లో ఫొటోలు అప్లోడ్ చేయాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.

సద్వినియోగం చేసుకోవాలి: భాగ్యలక్ష్మి అంగన్ వాడి సూపర్ వైజర్..
అంగన్ వాడి కేంద్రాల్లో  ప్రి స్కూల్ విద్య విధానాన్ని మెరుగు పర్చడం కోసం ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందులో భాగంగానే కేంద్రాలకు 60 రకాల పరికరాలు, ఆట వస్తువులు,టేబుళ్లు,మ్యాట్లు పంపిణీ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -