Saturday, July 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా ఎర్రబెల్లి దయాకర్ రావు జన్మదిన వేడుకలు 

ఘనంగా ఎర్రబెల్లి దయాకర్ రావు జన్మదిన వేడుకలు 

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవంగర: మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ శ్రేణులు మండల కేంద్రంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి, స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. పార్టీ కార్యాలయ ఆవరణలో మొక్కను నాటారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య మాట్లాడుతూ.. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత ఎర్రబెల్లి దయాకర్ రావు దే అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేసింది శూన్యమని విమర్శించారు. పలువురు యూత్ నాయకులు రక్తదానం చేశారు. కార్యక్రమంలో పాలకుర్తి దేవస్థానం మాజీ చైర్మన్ వెనుకదాసుల రామచంద్రయ్య శర్మ, మండల ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ సంజయ్ కుమార్, ఉపాధ్యక్షుడు కనుకుంట్ల వెంకన్న, సీనియర్ నాయకులు శ్రీరామ్ సుధీర్, దుంపల సమ్మయ్య, శ్రీరాం రాము, రాసాల సమ్మయ్య, గుగులోత్ పటేల్ నాయక్, నిమ్మల విజయ శ్రీనివాస్, విశ్వనాథుల జ్ఞానేశ్వర చారి, చింతల భాస్కర్, ధరావత్ రాజేందర్, భీమా, ఆరుట్ల వెంకట్ రెడ్డి, రెడ్డబోయిన గంగాధర్, వీరన్న, కృష్ణమూర్తి, నీలం సోమయ్య, చిలుక బిక్షపతి, షర్ఫీద్దీన్, రాంమూర్తి, దుంపల వేణు, అనుదీప్, మహేష్, యాకన్న తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -