Saturday, July 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అంబరాన్నంటిన ఎర్రబెల్లి జన్మదిన వేడుక‌లు

అంబరాన్నంటిన ఎర్రబెల్లి జన్మదిన వేడుక‌లు

- Advertisement -
  • ఆసుపత్రి, పాఠశాలలో పండ్ల పంపిణీ

నవతెలంగాణ-రాయపర్తి: ప్రజాక్షేత్రంలో అలుపెరుగని సైనికుడు రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జన్మదిన వేడుకలను బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు శుక్రవారం మండలంలో ఘ‌నంగా జరుపుకున్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావు ఆయురారోగ్యాలతో కలకాలం జీవించాలని మండలంలో శివాలయంలో, రామాలయంలో కార్యకర్తలు ప్రత్యేక పూజలు చేశారు. స్థానిక ప్రభుత్వాసుపత్రికి వచ్చిన రోగులకు పండ్లు పంపిణీ చేశారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. బస్టాండ్ ఆవరణలో టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. తదుపరి పార్టీ కార్యాలయంలో భారీ సైజులో ఉన్న కేబుల్ కట్ చేసి వేడుకలను జరుపుకున్నారు. ప్రజలకు మిఠాయి పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మునావత్ నరసింహ నాయక్ మాట్లాడుతూ.. కార్యకర్తలను కంటికి రెప్పల కాపాడుకుంటూ ప్రతి కష్టంలో అండగా నిలిచే నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు అని కొనియాడారు. పవర్ కాదు ముఖ్యం ప్రజల ఆకాంక్ష అని నమ్మిన సిద్ధాంత సేవకుడు ఎర్రబెల్లి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మండల వ్యాప్తంగా ఎర్రబెల్లి జన్మదిన వేడుకలు జరుపుకోవాలని సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, పీఎస్సీఎస్ చైర్మన్ రామచంద్రారెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి పూస మధు, ఎస్ఆర్ఆర్ ట్రస్ట్ కోఆర్డినేటర్స్ ఉబ్బని సింహాద్రి, సంకినేని ఎల్లస్వామి, మండల నాయకులు గారె నర్సయ్య, వేణుగోపాల్ రెడ్డి, బందెలా బాలరాజు, రంగారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, బాషబోయిన సుధాకర్, చిలువేరు సాయి గౌడ్, గజావెళ్లి ప్రసాద్, ముద్రబోయిన సుధాకర్, పొగులకొండ వేణు, చందు రాము, చిన్నాల ఉప్పలయ్య, కసరబోయిన రాజు, కుంట రాంబాబు, పిరని రాజు, బల్లెం యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -