Friday, January 9, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఎర్రవల్లి ఫామ్ హౌస్: కేసీఆర్‌ను క‌లిసిన మంత్రులు

ఎర్రవల్లి ఫామ్ హౌస్: కేసీఆర్‌ను క‌లిసిన మంత్రులు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మాజీ సీఎం కేసీఆర్ తో మహిళా మంత్రులు సీతక్క, కొండా సురేఖ భేటీ అయ్యారు. జనవరి 28 నుంచి మేడారంలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న సమ్మక సారక్క జాతరకు రావాలని కేసీఆర్ ను ప్రత్యేకంగా ఆహ్వానించారు మంత్రులు .

అనంతరం ఫామ్ హౌస్ బయట మీడియాతో మాట్లాడిన మంత్రులు సీతక్క, కొండా సురేఖ..మేడారం జాతరకు తమ ఆహ్వానాన్ని కేసీఆర్ స్వీకరించినట్లు చెప్పారు. కేసీఆర్ మేడారం వచ్చి అమ్మలను దర్శించుకుంటారని మంత్రులు చెప్పారు. అన్ని పార్టీ ఫ్లోర్ లీడర్లను మేడారం జాతరకు ఆహ్వానించినట్లు చెప్పారు . కేసీఆర్ తమకు చీరలు పెట్టడం సంతోషంగా ఉందన్నారు.

జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు మేడారం జాతర జరగనుంది. మొదటి రోజైన జనవరి 28 బుధవారం రోజున కన్నెపల్లి నుంచి సారలమ్మ, కొండాయి నుంచి గోవిందరాజులు, పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు మేడారంలోని గద్దెలపైకి చేరుకోనున్నారు. 29న చిలుకలగుట్ట నుంచి సమ్మక్కను తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్ఠిస్తారు. 30న భక్తులు మొక్కులు సమర్పించనున్నారు. 31న సాయంత్రం 6 గంటలకు అమ్మవార్లను తిరిగి వనప్రవేశం చేయడంతో మహా జాతర ముగియనున్నది.

https://twitter.com/BRSparty/status/2009232728806576420?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2009232728806576420%7Ctwgr%5E1d3682b5b14394c6fe84fe2bf25d9fd1bde0e387%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.ntnews.com%2Ftelangana%2Fbrs-chief-kcr-heartfelt-welcome-to-telangana-woman-ministers-dhanasari-seethakka-and-konda-surekha-2267265
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -