నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని చౌట్ పల్లి పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం లయన్స్ క్లబ్ కమ్మర్ పల్లి ఆధ్వర్యంలో మండలంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఉన్నత పాఠశాలల విద్యార్థులకు వ్యాచారచన పోటీలు నిర్వహించారు. మానవ సంబంధాలపై టెక్నాలజీ ప్రభావం అనే అంశంపై నిర్వహించిన ఈ పోటీల్లో పలు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. పోటీల ప్రారంభానికి ముందు నిర్వహించిన కార్యక్రమంలో మండల విద్యాధికారి ఆంధ్రయ్య ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు మంచి సబ్జెక్టు అంశంపై పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు.
ప్రస్తుత సమాజంలో మానవ సంబంధాలపై టెక్నాలజీ తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. టెక్నాలజీని సరైన విధానంలో ఉపయోగించకుంటే మంచి కంటే, చెడు దుష్ఫలితాలు ఎక్కువగా ఉంటాయన్నారు. విద్యార్థులు టెక్నాలజీని మంచి మార్గంలో జ్ఞాన సముపార్జన కోసం ఉపయోగించుకొని మంచి ఫలితాలను రాబట్టుకోవాలని తెలిపారు.లైన్స్ క్లబ్ మండల అధ్యక్షులు లుక్క గంగాధర్ మాట్లాడుతూ పోటీల్లో గెలుపొందిన విజేతలకు స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మెమెంటుతో సత్కరించి మొదటి బహుమతిగా రూ.1116, ద్వితీయ బహుమతిగా రూ.751, తృతీయ బహుమతిగా రూ.501 అందజేయడం జరుగుతుందన్నారు.
విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని లైన్స్ క్లబ్ కమ్మర్ పల్లి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వ్యాసరచన పోటీలను విజయవంతం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో లైన్స్ క్లబ్ కోశాధికారి తెడ్డు రమేష్, కార్యవర్గ సభ్యులు చింత ప్రదీప్, బద్దం రాజశేఖర్, చిలువేరి పవన్ కుమార్, సుంకరి విజయకుమార్, బషీరాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కనక గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.