38 గ్రామపంచాయతీలకు 12 క్లస్టర్ల ఎంపిక
ఈనెల 3 నుండి నామినేషన్ల స్వీకరణ : ఎంపీడీవో వేదవతి
నవతెలంగాణ – పాలకుర్తి
రెండవ సాధారణ గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఈనెల 3 నుండి 5 వరకు నిర్వహించే నామినేషన్ల స్వీకరణలో భాగంగా నామినేషన్ల స్వీకరణకు నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశామని ఎంపీడీవో వర్కల వేదవతి అన్నారు. సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో వేదవతి మాట్లాడుతూ మండలంలో 38 గ్రామపంచాయతీలకు గాను నామినేషన్ల స్వీకరణకు 12 క్లస్టర్లను ఎంపిక చేశామని తెలిపారు. క్లస్టర్ల వారిగా గుర్తించిన గ్రామాలు ఆయా క్లస్టర్లలో నామినేషన్లను దాఖలు చేసుకోవాలని తెలిపారు. సర్పంచులతోపాటు వార్డు సభ్యులు నామినేషన్ దాఖలు చేయాలన్నారు.
నామినేషన్ క్లస్టర్లకు రెండు నుండి మూడు గ్రామాలను కేటాయించామని తెలిపారు. వల్మిడి గ్రామపంచాయతీ భవనంలో ఏర్పాటుచేసిన నామినేషన్ల స్వీకరణ క్లస్టర్ లో వల్మీడీ, ముత్తారం, మంచుప్పుల, చెన్నూరు గ్రామపంచాయతీ క్లస్టర్ లో చెన్నూరు, గుడికుంట తండా, మైలారం, విసునూరు జెడ్ పి హెచ్ స్ పాఠశాలలో ఏర్పాటుచేసిన విసునూరు క్లస్టర్ లో విసునూరు, విష్ణుపురం, చీమల బావి తండా, తొర్రూరు జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో ఏర్పాటుచేసిన తొర్రూరు (జె) క్లస్టర్ లో తొర్రూరు, దుబ్బ తండా ఎస్పీ, శాతాపురం, లక్ష్మీనారాయణ పురం, ఈరవెన్ను జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఏర్పాటుచేసిన ఈరవెన్ను క్లస్టర్ లో ఈరవెన్ను, కోతులాబాద్, తిరుమలగిరి, గూడూరు గ్రామపంచాయతీ భవనంలో ఏర్పాటుచేసిన గూడూరు క్లస్టర్ లో గూడూరు, గోపాలపురం, నర్సింగాపురం తండా, కిష్టాపురం తండా, బమ్మెర గ్రామపంచాయతీ భవనంలో ఏర్పాటుచేసిన బమ్మెర క్లస్టర్ లో బొమ్మెర, పెద్ద తండా బి, రాగావపురం, పాలకుర్తి గ్రామపంచాయతీ భవనంలో ఏర్పాటుచేసిన పాలకుర్తి క్లస్టర్ లో పాలకుర్తి, అయ్యంగారి పల్లి, దర్దేపల్లి గ్రామపంచాయతీ భవనంలో ఏర్పాటు చేసిన ధర్దేపల్లి క్లస్టర్ లో దర్దేపల్లి, దుబ్బ తండా టి, తుమ్మ సముద్రం కుంట (టి ఎస్ కే) తండా, సిరిసన్న గూడెం, కొండాపురం ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటుచేసిన కొండాపురం క్లస్టర్ లో కొండాపురం, పెద్ద తండా కె, మేకల తండా, మల్లంపల్లి జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన మల్లంపల్లి క్లస్టర్ లో మల్లంపల్లి, బిఖ్య నాయక్ పెద్ద తండా, హట్య తండా, వావిలాల గ్రామపంచాయతీ భవనంలో ఏర్పాటుచేసిన వావిలాల క్లస్టర్ లో వావిలాల, నారబోయిన గూడెం గ్రామాలకు చెందిన సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులు నామినేషన్లు వేసుకోవాలని సూచించారు. నామినేషన్ల ప్రక్రియ ఉదయం 10:30 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుందని తెలిపారు.
ఎలాంటి గొడవలకు తావివ్వకుండా ప్రశాంతమైన వాతావరణంలో సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులు నామినేషన్లు వేసుకోవాలని సూచించారు. నామినేషన్ల ప్రక్రియకు ఇబ్బందులు కాకూడదనే ఉద్దేశంతో క్లస్టర్లను గుర్తించామని తెలిపారు. అభ్యర్థులు సమయపాలనను పాటించి నామినేషన్ లు స్వీకరించే అధికారులకు సహకరించాలని సూచించారు.



