ఎన్టీఆర్ స్టేడియం వద్ద ఘటన
నవతెలంగాణ – ముషీరాబాద్
హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద ఉన్న ఎన్టీఆర్ స్టేడియం సమీపంలో ఆదివారం మధ్యాహ్నం కారులో మంటలు చెలరేగాయి. టీఎస్09 జీడి 1262 నంబర్ గల ఎలక్ట్రిక్ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. పొగలు ఎగసిపడటం గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే ఎటువంటి ప్రాణనష్టమూ జరగలేదు. వాహనం మాత్రమే కాలింది. మంటలు ఎలా చెలరేగాయన్న దానిపై పోలీసులు విచారణ ప్రారంభించారు. అదేవిధంగా ఇందిరా పార్క్ బీసీ న్యాయ సాధన దీక్షకు సమావేశానికి వచ్చిన ములుగు జిల్లా కేంద్రానికి చెందిన కొంకతి రాములు టీఎస్25 టీ7488 కారు ఇదే కారు పక్కన పార్క్ చేసి ఉండటంతో ఆయన కారులోకి మంటలు వ్యాప్తి చెంది పాక్షికంగా కాలిపోయింది. కారు యజమాని తనకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
మంటల్లో ఈవీ కారు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



