Friday, August 8, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంకూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదైనా పీఆర్సీ ఊసేలేదు..

కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదైనా పీఆర్సీ ఊసేలేదు..

- Advertisement -

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్నా పీఆర్సీ కమిటీని ప్రకటించకపోవడం శోచనీయమని ఏపీ అమరావతి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై శనివారం ఆయన అనంతపురంలో మీడియాతో మాట్లాడారు. ఉద్యోగుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు తీసుకుంటున్న నిర్ణయాలు అమలు చేసే క్రమంలో రెవెన్యూ అధికారులు, ఉద్యోగులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వం వివక్ష చూపడం సరికాదని ఆయన అన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img