కవిత అభీష్టం మేరకే రాజీనామా ఆమోదం : శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
కవిత కొత్త పార్టీపై తెలంగాణ శాసన మండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి స్పందిస్తూ రాష్ట్రంలో కొత్తగా పార్టీలు పెట్టాల్సినంత అవసరం లేదని వ్యాఖ్యానించారు. కొత్త పార్టీ వచ్చినా మనుగడ కష్టమని అభిప్రాయపడ్డారు. గతంలో వచ్చిన పలు రాజకీయ పార్టీలు కనుమరుగైన విషయాన్ని గుర్తు చేశారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేయడంతోనే ఆమె రాజీనామాను ఆమోదించినట్టు మండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి తెలిపారు. భావోద్వేగంతో రాజీనామా చేసినప్పుడు కొంతకాలం వేచిచూస్తామని చెప్పారు.
కవిత విషయంలోనూ అదే చేశామని అభిప్రాయపడ్డారు. ఆమె అభీష్టమేరకే రాజీనామాను ఆమోదించి ఎన్నికల కమిషన్‌కు సమాచారం పంపినట్టు వివరించారు. గురువారం హైదరాబాద్‌లోని శాసనమండలిలోని తన కార్యాలయంలో మీడియాతో చిట్‌చాట్ చేశారు. ఏ ప్రాతిపదికన డీలిమిటేషన్ చేపడతారనే దానిపై స్పష్టత లేదని చెప్పారు. జనాభా ప్రాతిపదికన జరిగితే మాత్రం దక్షిణాది రాష్ట్రాలకు నష్టం చోటుచేసుకుంటుందని అన్నారు. హిల్ట్ విధానం ద్వారా ఎలాంటి అవినీతి జరగదని చెప్పారు. కాలుష్యం కట్టడికి పారిశ్రామిక భూముల క్రమబద్దీకరణకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరు తొలగించడం సరికాదని చెప్పారు.
కొత్త పార్టీ వచ్చినా మనుగడ కష్టం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



