Tuesday, June 3, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంపాలకులు మారినా..మారని విధానాలు

పాలకులు మారినా..మారని విధానాలు

- Advertisement -

హామీలను అమలు చేసి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి
11 ఏండ్లుగా జరగని అభివృద్ధి, సంక్షేమం : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-మిర్యాలగూడ

పాలకులు మారినా పరిపాలనా విధానాలు మాత్రం మారడం లేదని, నేటికీ రాష్ట్ర అభివృద్ధి జరగడం లేదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. ఆదివారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని స్థానిక సీపీఐ(ఎం) కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల పట్ల వివక్ష చూపుతోందని, దీనివల్ల ప్రభుత్వంలో ప్రతిపక్ష పార్టీలు ఉన్న రాష్ట్రాలకు నిధుల కేటాయింపుల సహకారం అందించడం లేదని విమర్శించారు. విభజన హామీలు కూడా అమలు కావడంలేదని విమర్శించారు. గత ప్రభుత్వం అవలంబించిన విధానాలే ఇప్పటి ప్రభుత్వం అమలుచేస్తున్నదని అన్నారు. దాంతో పేద ప్రజలకు అభివృద్ధి, సంక్షేమం అందడంలేదన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేసి ప్రభుత్వం చిత్తశద్ధి నిరూపించుకోవాలని తెలిపారు. ప్రభుత్వం విద్య, వైద్య రంగాలను నిర్వీర్యం చేస్తున్నదని, ప్రయివేట్‌ రంగాన్నే ప్రోత్సహిస్తున్నదని అన్నారు. అతిపెద్ద వ్యాపార రంగంగా విద్యా, వైద్య రంగాలను మార్చారని విమర్శించారు. స్థానికసంస్థల ఎన్నికలు జరగకపోవడంతో గ్రామ పంచాయతీలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయని, వెంటనే ఎన్నికలు నిర్వహించాలని కోరారు. రాష్ట్రంలో కోటీ 20 లక్షల మంది అసంఘటిత రంగ కార్మికులు ఉన్నారని, వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. ఈ ప్రభుత్వం ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని, లిఫ్టుల ఇరిగేషన్‌ నిర్వహణ బాధ్యత చేపట్టడం లేదని, కట్టిన ప్రాజెక్టులు కూలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని, దాని ఫలితంగా ప్రజల తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని చెప్పారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్‌ మల్లేష్‌, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, వన్‌టౌన్‌, టూ టౌన్‌ కార్యదర్శులు డాక్టర్‌ మల్లు గౌతమ్‌రెడ్డి, భావండ్లపాండు, జిల్లా నాయకులు పాదూరి శశిధర్‌రెడ్డి, సీనియర్‌ నాయకులు పారేపల్లి సత్యనారాయణరావు, లింగయ్య, రామారావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -