Wednesday, August 6, 2025
E-PAPER
Homeఖమ్మం18 ఏండ్లు నిండిన ప్రతీ పౌరుడికి ఓటు హక్కు ఉండాలి...

18 ఏండ్లు నిండిన ప్రతీ పౌరుడికి ఓటు హక్కు ఉండాలి…

- Advertisement -

రాజకీయ పార్టీలు ఏజెంట్ లను కేటాయించాలి…
తహశీల్ధార్ సీహెచ్వీ రామక్రిష్ణ
నవతెలంగాణ – అశ్వారావుపేట

స్థానిక తహశీల్దార్  కార్యాలయంలో బుదవారం సహాయ ఎన్నికల నమోదు అధికారి తహశీల్దార్ సీహెచ్వీ రామక్రిష్ణ అధ్యక్షతన రాజకీయ పార్టీ ప్రతినిధులతో స్పెషల్, ఇంటెన్సిన్ రివిజన్ (ఎస్ఐఆర్) లో భాగంగా, ఎన్నికల దరఖాస్తులు,పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ పై సమావేశం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో (18) సంవత్సరాలు నిండిన ప్రతీ పౌరుని కి ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవాలని  తెలిపినారు. అలాగే త్వరలో ఇంటింటి సర్వే కార్యక్రమంలో బూత్ స్థాయి అధికారులు 2002 ఓటర్ల జాబితాలో పేరు ఉండి ప్రస్తుత ఓటర్ల జాబితాలో పేరు ఉన్న వారి పేర్లతో సరిపోల్చుకొని మార్పులు ఉన్నట్లైతే తగు చర్యలు తీసుకుంటారని తెలియజేసారు. అదేవిధంగా పోలింగ్ కేంద్రంలో (1200) ఓట్లు కన్నా ఎక్కువ వున్నట్లు అయితే కొత్త పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయవలసినదిగా ఎన్నికల కమీషన్ వారు ఆదేశాలు ప్రకారం  (1200) ఓట్లు దాటిన పోలింగ్ కేంద్రాలు 118- ఆశ్వారావుపేట(ఎ.తె) నియోజక వర్గంలో లేనందున కొత్త పోలింగ్ కేంద్రాల ప్రతిపాదనలు ప్రస్తుతం లేవని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట మండల తహశీల్దార్ సీ హెచ్ వి. రామకృష్ణ, ఎన్నికల నాయబ్ తహశీల్దార్ శ్రీ యస్.డి హుస్సేన్, ఎన్ని కల సీనియర్ సహాయకులు లక్ష్మయ్య,సీపీఐ(ఎం),సీపీఐ,బీజేపీ,బీఆర్ఎస్ నాయకులు బి.చిరంజీవి,సోడెం ప్రసాద్,రామక్రిష్ణ,బండారు చంద్రశేఖర్,సత్యవరపు సంపూర్ణ లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -