– సద్వినియోగం చేసుకుందాం
– న్యాయపరమైన వాటాల కోసం కేంద్రంపై ఒత్తిడి
– సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
కష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు రావాల్సిన ప్రతి నీటి బొట్టునూ సద్వినియోగం చేసుకోవాలనీ, న్యాయపరంగా రావాల్సిన నీటి వాటాల సాధనకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. కృష్ణాపై తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులకు వెంటనే క్లియరెన్స్ ఇవ్వాలనీ, నీటి కేటాయింపులతో పాటు ప్రాజెక్టుల నిర్మాణానికి ఆర్థిక సాయం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నారు. కృష్ణాతోపాటు గోదావరి జలాల విషయంలో తెలంగాణ ప్రయోజనాలను పరిరక్షించుకోవటంతో పాటు, ఇంతకాలం జరిగిన అన్యాయానికి శాశ్వతమైన పరిష్కారాలను సాధించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సీఎం సూచనలతో కేంద్ర జల వనరుల శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌కు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి లేఖ రాశారు. ఈనెల 16న ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రితో సమావేశమై తెలంగాణ నీటి వాటాల సాధనతో పాటు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు అనుమతులు, నీటి కేటాయింపులు, కొత్త ప్రాజెక్టులకు పట్టుబట్టాలని నిర్ణయించారు. కృష్ణానదీ జలాల వినియోగంలో ఇంతకాలం తెలంగాణకు తీరని ద్రోహం జరిగిందని అభిప్రాయపడ్డారు. గడిచిన పదేండ్లలో అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం కృష్ణా జలాల్లో న్యాయపరంగా రావాల్సిన నీటి కోటా సాధించటంలో దారుణంగా విఫలమైందని పేర్కొన్నారు. తెలంగాణకు 299 టీఎంసీలు మాత్రమే నీటి వాటాకు అంగీకరించి ఏపీకి 512 టీఎంసీలు కట్టబెట్టిందన్నారు. శ్రీశైలం ఎగువన ఏపీ అక్రమంగా నిర్మించుకున్న ప్రాజెక్టులన్నింటికీ వంత పాడి, కృష్ణా నీళ్లను ఏపీ యథేచ్ఛగా మళ్లించుకుంటే మౌనం వహించిందని గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కష్ణాపై నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు ఇవ్వకుండా అసంపూర్తిగా వదిలేసిందని తెలిపారు. అటు గోదావరిపై తుమ్మిడిహెట్టిపై చేపట్టిన ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టును రూ.11 వేల కోట్లు ఖర్చు చేసిన తర్వాత పక్కనబెట్టిందని విమర్శించారు. దానికి బదులు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి రూ. లక్ష కోట్లకు పైగా ప్రజాధనం దుర్వినియోగం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం సీఎం కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.
కృష్ణా, గోదావరి జలాల్లో ప్రతి నీటిబొట్టునూ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES