అగ్రకథానాయకులు చిరంజీవి, వెంకటేష్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’తో ప్రేక్షకులను అలరించబోతున్నారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకుడు. నయనతార కథనాయికగా నటిస్తుండగా, అర్చన సమర్పిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా ఈనెల 12న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్‌గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. చిరంజీవి మాట్లాడుతూ,’ఈ సంక్రాంతి కేవలం ‘శంకర వరప్రసాద్’దే కాదు.. మొత్తం తెలుగు సినిమా పరిశ్రమది అవ్వాలని కోరుకుంటున్నాను.
ప్రభాస్ ‘రాజాసాబ్’, నా తమ్ముడు రవితేజ సినిమా, మా ఇంట్లో చిన్నప్పుడు నుంచి సరదాగా తిరుగుతూ పెరిగిన శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారి’, నన్ను గురువుగా భావిస్తూ నా శిష్యుడుగా ఉన్న నవీన్ సినిమా..అన్ని సినిమాలు ఈ సంక్రాంతికి సూపర్ హిట్ అవ్వాలని, తెలుగు చిత్ర పరిశ్రమ సుభిక్షంగా ఉండాలని ఆశిస్తున్నాను. ప్రతి సినిమా పర్ఫెక్ట్ సంక్రాంతికి వచ్చే సినిమా, నచ్చే సినిమా’ అని చిరంజీవి అన్నారు. ‘చిరంజీవితో వర్క్ చేయడం వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఇద్దరం రాఫ్ఫాడాం. రచ్చ రచ్చే. నేను మా తమ్ముళ్ళు పవన్ కళ్యాణ్‌తో మహేష్‌తో మల్టీ స్టార్స్ చేశాను. ఇప్పుడు అన్నయ్యతో చేశాను. సౌండ్ ఇంకా గట్టిగా ఉండాలి. ఇదే సంక్రాంతి స్పిరిట్. అనిల్‌తో నాది వండర్ఫుల్ కాంబినేషన్. అన్ని సినిమాలు మీరు సూపర్ హిట్ చేశారు’ అని వెంకటేష్ చెప్పారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ,’ఇది నాకు తొమ్మిదో సినిమా. చిరంజీవితో చేయడం చాలా ఆనందంగా ఉంది.
చిరంజీవి, వెంకటేష్ కాంబినేషన్‌ని మీరందరూ చాలా ఎంజాయ్ చేస్తారు. వెంకీ గౌడగా కర్ణాటక బ్యాక్‌డ్రాప్‌లో రాబోతున్నారు. చిరంజీవి, వెంకటేష్‌ని ఒకే ఫ్రేమ్‌లో చూడాలని ఎన్నో ఏళ్ల కల నాది. అది నాకు కుదిరింది. అది నా అదృష్టంగా భావిస్తున్నాను. తెలుగు ప్రేక్షకులకు ఒక కన్నుల విందు ఇవ్వాలనేది వాళ్ళిద్దరూ కలిసి తీసుకున్న నిర్ణయం అది. తెలుగు సినిమా చరిత్రలో వారి కాంబినేషన్ మెమొరబుల్‌గా మిగిలిపోతుంది’ అని తెలిపారు. ప్రొడ్యూసర్ సుస్మిత కొణిదెల మాట్లాడుతూ,’డాడీ, వెంకటేష్ రాగానే ఈ వైబంతా మారిపోయింది. ఈ సినిమా నా జీవితంలో బిగ్ మైల్స్టోన్ ప్రాజెక్ట్. ఈ సినిమా మెగా ఫ్యాన్స్‌కి నాకు మరింత దగ్గర అయ్యేలా చేసింది’ అని అన్నారు. ‘ఏ ప్రొడ్యూసర్‌కైనా ఒక స్టార్ హీరోతో చేయడమే అదృష్టం. అలాంటిది నాకు మా అనిల్ ద్వారా ఇద్దరు స్టార్స్‌తో చేసే అవకాశం దొరికింది. గత సంక్రాంతికి అనిల్ బాక్సాఫీస్‌ని ఎలా షేక్ చేశారో మీరందరూ చూశారు. ఈ సినిమాతో మొత్తం అదిరిపోద్ది. సినిమా మీద చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం’ అని ప్రొడ్యూసర్ సాహు గారపాటి చెప్పారు.
సంక్రాంతికి వచ్చే ప్రతి సినిమా ఆడాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



