Saturday, August 2, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంప్రతి అడుగు ప్రజల కోసమే

ప్రతి అడుగు ప్రజల కోసమే

- Advertisement -

ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

తమ ప్రభుత్వం వేసే ప్రతి అడుగు తెలంగాణ ప్రజల కోసమేనని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు అన్నారు.. గురువారం హైదరాబాద్‌లోని యూఎస్‌ కాన్సులేట్‌ జనరల్‌ కార్యాలయ ప్రాంగణంలో రూ.1.5 కోట్లతో తెలంగాణ ఇండిస్టియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పోరేషన్‌ (టీజీఐఐసీ) నిర్మించిన ‘వెయిటింగ్‌ ఏరియా’ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం 20 నెలల కాలంలో తీసుకున్న ప్రతి నిర్ణయం ప్రజల కోసమేనని గుర్తు చేశారు. ”యూఎస్‌ కాన్సులేట్‌కు ప్రతి రోజూ 3వేల మందికి పైగా సందర్శకులు వస్తుంటారు. వేచి చూసేందుకు సరైన సౌకర్యాలు లేక ఇక్కడి కొచ్చేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. క్షేత్రస్థాయి లో అధ్యయనం చేసి ఎక్కడెక్కడె ఏం అవసరమో గుర్తించి అందు కనుగుణంగా అత్యాధునిక వసతులతో కూడిన వెయిం టింగ్‌ ఏరియాను అందుబాటులోకి తీసుకొ చ్చాం. కేవలం పారిశ్రామిక, సాంకేతిక రంగాలకే పరిమితం కాకుండా, ప్రజల రోజువారీ జీవితాల్లో మార్పు తెచ్చేందుకు మా ప్రభుత్వం తీసుకుం టున్న చొరవకు ఇది నిదర్శనం’ అని శ్రీధర్‌బాబు వివరిం చారు. ఫార్మా, ఏరో స్పేస్‌, ఎలక్ట్రానిక్స్‌, ఈవీ రంగా ల్లో అమెరికా రాష్ట్రానికి అగ్రగామి వ్యాపార భాగస్వామి ఉందని అన్నా రు. తెలంగాణ ఐటీ ఎగుమతుల్లో 38 శాతం ఉత్తర అమెరికా కు జరుగు తున్నాయని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో హైదరా బాద్‌ అమెరికా కాన్సుల్‌ జనరల్‌ జెన్నీఫర్‌ లార్సన్‌ తదితరులు పాల్గొన్నారు.
జనరల్‌ జెన్నిఫర్‌ లార్సన్‌కు మంత్రి వీడ్కోలు
హైదరాబాద్‌ అమెరికా కాన్సుల్‌ జనరల్‌గా తన పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న జెన్నిఫర్‌ లార్సన్‌కు మంత్రి శ్రీధర్‌ బాబు గురువారం ఆత్మీయ వీడ్కోలు పలికారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే చేనేత చీరను ఆమెకు బహుకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలం గాణ, అమెరికా మధ్య సత్సంబంధాలను బలోపేతం చేసేందుకు ఆమె విశేష కృషి చేశారని కొనియాడారు. విద్య, సాంస్కృతిక మార్పిడి, వాణిజ్య రంగాల్లో భాగస్వామ్యాన్ని పెంపొందిం చడంలో కీలకంగా వ్యవహరించారన్నారు. ఆమె అందించిన సహకారం, దార్శనికతకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -