– జిల్లా అబ్సర్వర్ అధికారి ఒడ్డెన్న
నవతెలంగాణ – సదాశివనగర్
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివే ప్రతి విద్యార్థి పై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రతి విద్యార్థి హాజరు అయ్యేటట్లు చూడాలని కామారెడ్డి జిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాలల అబ్జర్వర్ వడ్డెన్న అన్నారు. మంగళవారం ఆయన మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను పరిశీలించారు. తరగతి గదులను విద్యార్థుల హాజరు శాతాన్ని పరిశీలించారు. అనంతరం కళాశాల సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
ఇదివరకే ఒక్కొక్క యూనిట్ పూర్తి అయి ఉంటుంది కాబట్టి యూనిట్ టెస్టులు నిర్వహించి ఏ ఏ విద్యార్థి ఏమి చదువుతున్నాడు పరిశీలించి విద్యార్థి పై శ్రద్ధ వహించాలి. ఒకవేళ ఏ విద్యార్థి అయినా కళాశాలకు గైర్హాజరైనట్లయితే సంబంధిత లెక్చరర్ జానీ ప్రిన్సిపాల్ గాని తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా సమాచారం అందజేసి ఎందుకోసం గైర్హాజరయ్యారు అనే విషయాన్ని కనుక్కోవాలని చెప్పారు. విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి అన్నారు. కళాశాలలో ప్రతి వారంలో ఒకరోజు క్విజ్, ఆటల పోటీలు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ తెలిపారు.
అమ్మ ఆదర్శ కమిటీలను చేయాలని సూచించారు. ఆ కమిటీల ద్వారా కళాశాలకు కళాశాలలకు వచ్చిన నిధులను కళాశాలకు అవసరమయ్యే బెంచీలు గాని ఇతర సామాగ్రి ఏదైనా అవసరం ఉన్నా కమిటీల ఆధ్వర్యంలో ఖర్చు చేయాలని చెప్పారు. ప్రైవేటు కళాశాలలకు దీటుగా ప్రతి ప్రభుత్వ కళాశాలలో నీట్, ఎంసెట్ వంటి తరగతులను ప్రొజెక్టర్ ద్వారా ఫిజిక్స్ వాలా ద్వారా నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశాలు పేరెంట్ టీచర్ సమావేశాలు నిర్వహిస్తామన్నారు. ప్రతి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు ప్రతి తరగతి గదిలో సీసీ కెమెరా ఉండేటట్లు చూస్తామని తెలిపారు. తెలిపారు అనంతరం కళాశాల ఆవరణలో మొక్కలను నాటారు. వీర వెంట ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాం, కళాశాల ప్రిన్సిపల్ సింగం శ్రీనివాస్ లతోపాటు జిల్లాలోని వివిధ కళాశాల ప్రిన్సిపాల్ లు పాల్గొన్నారు.
ప్రతి విద్యార్ది హాజరు అయ్యేట్లు చూడాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES