పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లెక్చరర్ కే.ఉమా
నవతెలంగాణ – వనపర్తి
ప్రభుత్వ విధాన విశ్లేషణపై ప్రతి విద్యార్థిని,విద్యార్థులకు పూర్తిగా అవగాహన ఉండాలని పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అధ్యాపకులు కే.ఉమా అన్నారు. సోమవారం వనపర్తి జిల్లా కేంద్రం ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ కళాశాలలో పొలిటికల్ సైన్స్ విస్తృత ఉపన్యాసకులు డాక్టర్.ఎల్. పుష్ప ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వంలో ఉన్న చట్టాలు,పాలన విధానము ఏవిధంగా చేయబడతాయన్నారు. మేధో మతనం ఏవిధంగా చేయబడుతుందని, చట్టాల ఏవిధంగా రూపకల్పన చేయాలనే అంశాలపైన వివరంగా విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ ఈశ్వరయ్య, వైస్ ప్రిన్సిపాల్ రామరాజు యాదవ్, అకాడమీ కోఆర్డినేటర్ డాక్టర్. దామోదర్ రెడ్డి, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
ప్రతి స్టూడెంట్ ప్రభుత్వ విధాన విశ్లేషణపై అవగాహన కలిగి ఉండాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES