Monday, August 11, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ప్రతి విద్యార్థీ ఆల్బెండజోల్ మాత్రలు వేసుకోవాలి: కలెక్టర్

ప్రతి విద్యార్థీ ఆల్బెండజోల్ మాత్రలు వేసుకోవాలి: కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – కామారెడ్డి
నులిపురుగుల నివారణకు 1 నుండి 19 సంవత్సరాల లోపు ప్రతి ఒక్కరు ఆల్బెండజోల్ మాత్రలు వేసుకోవాలనీ  జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్  తెలిపారు. జిల్లా వైద్య , ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సోమవారం నులిపురుగుల నివారణ దినోత్సవం 2025 సంవత్సరంకు కామారెడ్డి జిల్లాలో అన్ని పాఠశాలల లో, అంగన్వాడీ పాఠశాల లలో, ఇంటర్మీడియట్ కళాశాలలో ఒకటి నుంచి 19 సంవత్సరాల పిల్లలకు నులిపురుగుల నివారణ మాత్రలు (ఆల్బెండజోల్) లను వేశారు. ఈ నులి పురుగుల నివారణ దినోత్సవాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కామారెడ్డి మండలం దేవునిపల్లిలో గల జిల్లా పరిషత్ హై స్కూల్లో విద్యార్థులకు ఆల్బండజోల్  మాత్రలు వేసి  ప్రారంభించారు. 

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 1 నుంచి 19 సంవత్సరాల పిల్లలందరూ నులి పురుగుల నివారణ మాత్రలు వేసుకుని నులిపురుగుల వల్ల సంభవించు రక్తహీనత, ఆకలిలేమి, మానసిక, ఆరోగ్య పరంగా ఎదుగుదల వంటి వ్యాధుల నుండి దూరంగా ఉండి విద్యార్థులందరూ ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని ఒకటి నుంచి 19 సంవత్సరాలు గల పిల్లలందరూ ఉపయోగించుకొని ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. ఈరోజు నులి పురుగుల నివారణ మాత్రలు వేయించుకొని వారు ఈ నెల ఆగస్టు 18 వ తారీఖున వేయించుకోవాలని సూచించారు.  ఈ కార్యక్రమంలో డాక్టర్ పి చంద్రశేఖర్, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి, రాజు  జిల్లా విద్యా శాఖ అధికారి,  ప్రభు కిరణ్ డిప్యూటీ డిఎంహెచ్ఓ, డాక్టర్ విద్యా,  జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి , మండల విద్యాశాఖ అధికారి ఎల్లయ్య, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img