Thursday, July 3, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుపది పాసైన ప్రతి విద్యార్థీ ఇంటర్‌ పూర్తి చేయాలి

పది పాసైన ప్రతి విద్యార్థీ ఇంటర్‌ పూర్తి చేయాలి

- Advertisement -

– 9-12 తరగతుల విధానంపై అధ్యయనం చేయండి
– కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులు సాధించాలి
– యంగ్‌ ఇండియా గురుకులాల ప్రగతిపై నివేదిక ఇవ్వండి : విద్యాశాఖ సమీక్షలో అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలో పదో తరగతిలో ఉత్తీర్ణులైన ప్రతి ఒక్క విద్యార్థి తప్పనిసరిగా ఇంటర్మీడియట్‌ పూర్తి చేసేలా చూడాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. పదోతరగతిలో పెద్ద సంఖ్యలో ఉత్తీర్ణత కనిపిస్తోందనీ, ఇంటర్‌ పూర్తయ్యే సరికి ఆ సంఖ్య గణనీయంగా తగ్గి పోవడానికి గల సమస్యలను గుర్తించి వాటి పరిష్కా రానికి కృషి చేయాలని సూచించారు. విద్యాశాఖపై హైదరాబాద్‌ లోని ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ (ఐసీసీసీ)లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. విద్యార్థి జీవితంలో ఇంటర్మీడియట్‌ దశ కీలక మైనందున..

ఆ దశలో విద్యార్థికి సరైన మార్గ దర్శకత్వం లభించాల్సిన అవసరముందని సీఎం అభిప్రాయపడ్డారు. ఇతర రాష్ట్రాల్లో 9 నుంచి 12వ తరగతి వరకు ఉంటుందనీ, అక్కడ డ్రాపౌట్స్‌ సంఖ్య తక్కువగా ఉందని అధికారులు సీఎంకు వివరించారు. ఇంటర్మీడియట్‌ వేరుగా, 12వ తరగతి వరకు పాఠశాలలు ఉన్న రాష్ట్రాల్లో అధికారులు అధ్య యనం చేసి ఈ విధానంపై సమగ్ర నివేదిక సమర్పించాలని రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఈ విషయంలో విద్యా కమిషన్‌, ఆ విభాగంలో పనిచేసే ఎన్జీవోలు, పౌర సమాజం సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకోవా లని సూచించారు.
ఇంట ర్మీడియట్‌ విద్య మెరుగుకు అన్ని దశల్లో చర్చించి శాసనసభ లోనూ చర్చకు పెడతామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఇంటర్మీడియట్‌లో విద్యార్థుల చేరికతో పాటు వారి హాజరుపైనా దృష్టిపెట్టాలన్నారు. యంగ్‌ ఇండియా గురుకుల విద్యాసంస్థల నమూ నాలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పరిశీలించారు. ప్రతి పాఠశాల ఆవరణలో భారీ జాతీయ జెండా ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎం సూచించారు. పాఠశాలల నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేయాలనీ, నిర్మాణాల ప్రగతిపై ప్రతి వారం తనకు నివేదికను సమర్పించాలని సీఎం అధికా రులను ఆదేశించారు. ప్రతి నియోజక వర్గంలో బాలురకు ఒకటి, బాలికలకు ఒకటి యంగ్‌ ఇండియా గురుకుల పాఠశాలల నిర్మాణాలను చేపడతామన్నారు. ఇప్పటికే ఒక్కో పాఠశాలకు సంబంధించి స్థల సేకరణ పూర్తైనందున, రెండో పాఠశాలకు సంబంధించిన స్థల గుర్తింపు, సేకరణ ప్రక్రియపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.

వీర నారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వ విద్యాలయం నిర్మాణ నమూనాను సీఎం రేవంత్‌రెడ్డి పరిశీలించారు. పలు మార్పులను సూచించారు. సాధ్యమైనంత త్వరగా టెండర్ల ప్రక్రియను పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ఈ కార్యక్రమం లో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్‌ రెడ్డి, విద్యా శాఖ కార్యదర్శి యోగితా రాణా, ఉన్నత విద్యామండలి చైర్మెన్‌ వి.బాలకిష్టారెడ్డి, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ శ్రీదేవసేన, ప్రత్యేక కార్యదర్శి హరిత, జేఎన్టీయూ రిజిస్ట్రార్‌ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -