Tuesday, August 12, 2025
E-PAPER
spot_img
Homeట్రెండింగ్ న్యూస్పరిస్థితులను బట్టి స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించాలి : సీఎం రేవంత్‌

పరిస్థితులను బట్టి స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించాలి : సీఎం రేవంత్‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : రాష్ట్రంలో భారీ వ‌ర్షాలు కురుస్తున్న నేప‌ద్యంలో సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల క‌లెక్ట‌ర్ల‌తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..రాబోయే 72 గంటలు అందరూ అప్రమత్తంగా ఉండాల‌ని లోతట్టు ప్రాంతాలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని, పరిస్థితులను బట్టి స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించాల‌ని అధికారుల‌కు కీల‌క ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడ ఏం జరిగినా సమాచారం కంట్రోల్ రూం కు చేరేలా చూడాలి ముంపు ప్రాంతాల్లో ప్రజలను సురక్షితప్రాంతాలకు తరలించాల‌న్నారు.

ఎక్కడా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగడానికి వీళ్లేదు సహాయక చర్యలకు అవసరమైన నిధులు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంద‌న్నారు. విద్యుత్ శాఖ అధికారులు ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండాలి మొబైల్ ట్రాన్స్ఫార్మర్ లు, జనరేటర్లు సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు. డ్రైనేజ్ వ్యవస్థను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి అత్యధిక వర్షాలు పడే ప్రాంతాలను ముందుగానే గుర్తించి ప్రజలను అప్రమత్తం చేయాల‌న్నారు. గతంలో ఖమ్మంలో 2 గంటల్లో 42 సెం.మీ వర్షం పడింది అలాంటి పరిస్థితులను కూడా ఎదుర్కొనేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలి ఉద్యోగులు, సిబ్బంది సెలవులు రద్దు చేసి 24 గంటలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాల‌ని సూచించారు. హైదరాబాద్ లో ప్రమాద స్థాయికి నీరు చేరిన చోట ప్రజలు వెళ్లకుండా పోలీసు సిబ్బంది అలెర్ట్ చేయాల‌ని ఈ కాన్ఫ‌రెన్స్ లో సీఎం రేవంత్ రెడ్డి అంద‌రికి ఆదేశాలు జారీ చేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img