సీనియర్ సివిల్ జడ్జ్ రాధిక జైష్వాల్
నవతెలంగాణ – తంగళ్ళపల్లి
ప్రతి ఒక్కరు తప్పనిసరిగా చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సీనియర్ సివిల్ జడ్జ్ రాధిక జాషువా అన్నారు. తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని ట్రైబల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాలలో శనివారం ఆదివాసి హక్కుల దినోత్సవ సందర్భంగా న్యాయ సేవ సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల కు న్యాయ సేవపై పలు సూచనలు, సలహాలను అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి చట్టంలో ఉన్న ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. న్యాయ సేవపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రతి ఒక్కరికి న్యాయ సేవలో రక్షణ కల్పించేందుకు ఎన్నో సెక్షన్లు ఉన్నాయన్నారు. తప్పు చేసిన వారు ఎవరైనా సరే శిక్షింపబడతారు. తప్పు చేయని వారికి న్యాయ సేవ అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో లోక్ అదాలత్ నెంబర్ చింతజి భాస్కర్, ఆడెపు వేణు, లీగల్ ఎయిడ్ కౌన్సిల్ టి పరశురాములు, మల్లేష్ యాదవ్, సీనియర్ న్యాయవాది కుంట శ్రీనివాస్ పాల్గొన్నారు.
చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES