సర్పంచ్ ఎడ్ల వెంకట్ రెడ్డి..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరి మండలంలోని బిఎన్ తిమ్మాపురం గ్రామంలో సర్పంచ్ ఎడ్ల వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రజాపాలన – ప్రగతి పాలనలో భాగంగా 99 రోజుల ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శనివారం గ్రామంలో ర్యాలీ తీసి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు గ్రామ ప్రజలందరు సహకరించాలని గ్రామస్తులను కోరారు.గ్రామ పరిసరాలలో చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా, ఇంటింటికి చెత్త బండి వచ్చినప్పుడు తడి చెత్త,పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలని కోరారు.
దోమల నివారణ కొరకు మన ఇంటి పరిసరాలను శుభ్రంగ ఉంచుకోవాలని మహిళలను కోరారు.రాబోయే వేసవిని దృష్టిలో ఉంచుకొని గ్రామంలో మంచినీటి కొరత రాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని,గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కారం అయ్యేవిదంగా కృషిచేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సెక్రెటరీ శ్రీనివాస్, వార్డు సభ్యులు దొంకేన పాండు రంగం,జిన్న కవిత,జూపల్లి లావణ్య,ఉడుత మణికంఠ,తోటకురి రమేష్,జిన్న నర్సింహ,పిన్నం హంసమ్మ,తోటకురి పాండు,పిన్నం కవిత,గ్రామ పంచాయతీ కరోబర్ ఉడుత శ్రీశైలం,మోర నర్షి రెడ్డి,మాజీ వార్డు సభ్యులు వళ్ళందస్ పరమేష్,నకిరేకంటి హరిబాబు,రావుల మహిపాల్, గంగాదేవి కిష్టయ్య పాల్గొన్నారు.



