వైస్ ఛాన్సలర్ టి యాదగిరి రావు..
నవతెలంగాణ – డిచ్ పల్లి
ప్రతి ఒక్కరూ ప్రకృతిని పరిరక్షించాలని తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ టి యాదగిరి రావు పేర్కొన్నారు. మంగళవారం తెలంగాణ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ విభాగం యూనిట్ ఒకటి మరియు నాలుగు ఆధ్వర్యంలో కొత్తగా నిర్మించిన సైన్స్ కళాశాల ఆవరణలో వన మనోత్సవం ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త ప్రొఫెసర్ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టీ. యాదగిరి రావు హాజరై మాట్లాడుతూ మానవాళి మనుగడకు చెట్లు పెంపకం అత్యంత ఆవశ్యకమని తెలిపారు. అడవి విస్తీర్ణం తగ్గటం వల్లనే వాతావరణ ప్రతికూల సమస్యలు ఏర్పడి దుర్భిక్ష పరిస్థితులతో పాటు తీవ్ర అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయని తెలిపారు.ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పర్యావరణ రక్షణకు పాటు పడుతూ గ్రామ మరియు పట్టణ ప్రాంత ప్రజలకు అవగాహన కల్పించి ప్రకృతిని పరిరక్షించాలన్నారు .
ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరైన రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం యాదగిరి మాట్లాడుతూ పర్యావరణను క్షీణత వలన ఓజోన్ పొర నాణ్యత క్షీణించి ప్రజలకు తీవ్రమైన అనారోగ్య పరిస్థితులు ఎదుర్కొంటున్నారని దీన్ని నివారించడానికి ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలను నాటి వాటిని పరిరక్షించాలని సూచించారు. దీని కొరకు సామాజిక అడవులు పెంపకం, పట్టణ అటవీ కరణతో పాటు అటవీ చట్టాలను కఠిన తరం చెయ్యాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ డాక్టర్ సి హెచ్ అరతి,కామర్స్ డీన్ ప్రొఫెసర్ రాంబాబు,డైరెక్టర్ ( పి ఆర్ ఓ ) డాక్టర్ ఏ పున్నయ్య, యూజీసీ డైరెక్టర్ ప్రొఫెసర్ ఆంజనేయులు, డాక్టర్. నందిని, డాక్టర్ అతీక్ సుల్తాన్ ఘోరి, అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్. వాసం చంద్రశేఖర్, ప్రొఫెసర్ డాక్టర్ మొహమ్మద్ అబ్దుల్ ఖవి, ప్రొఫెసర్ లావణ్య, డాక్టర్. ప్రసన్న రాణి ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ స్వప్న, డాక్టర్ స్రవంతితోపాటు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.