– దళిత బహుజన ఫ్రంట్  రాష్ట్ర నాయకులు తలారి ప్రభాకర్
నవతెలంగాణ – కామారెడ్డి, బీబీపేట్ 
తుజాల్ పూర్ గ్రామంలో మూడు ప్రైమరీ స్కూల్ ను మూడు అంగన్వాడి సెంటర్లు అదేవిధంగా జిల్లా పరిషత్ స్కూల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరు గౌరవించాలని, రాజ్యాంగంలోని విధి విధానాలను తెలుసుకోవాలని విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దళిత బహుజన ఫ్రంట్  రాష్ట్ర నాయకులు తలారి   ప్రభాకర్ మాట్లాడుతూ.. ప్రతి ఒక విద్యార్థిని, విద్యార్థులు భారత రాజ్యాంగాన్ని చదవాలని ఆయన ఆశయాన్ని కొనసాగించాలని ఆయన విద్యార్థిని విద్యార్థులను కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం, అంగన్వాడి టీచర్స్, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరు గౌరవించాలి
- Advertisement -
- Advertisement -

                                    

