నవతెలంగాణ – బంజారా హిల్స్
పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ గణేష్ మట్టి విగ్రహాలను పూజించాలని HMDA చీఫ్ ఇంజనీర్ రవీందర్ అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మంగళవారం ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు, HMDA SE అప్పారావు, DE గణేష్ లతో కలిసి సిఈ గణేష్ ప్రతిమలను పంపిణీ చేశారు. ప్రతి ఏటా వినాయక చవితి సందర్భంగా హెచ్ఎండిఏ అందించే గణేష్ మట్టి విగ్రహాలను ఈసారి కూడా రెండు రోజుల పాటు ప్రెస్ క్లబ్ సభ్యులకు అందజేశారు. హైదరాబాద్ జంట నగరాల్లో హెచ్ఎండిఏ మొత్తం లక్ష వరకు గణేష్ మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తుంది.ఇందులో భాగంగా జర్నలిస్టుల కోసం ప్రెస్ క్లబ్ లో రెండు వేల మట్టి విగ్రహాలను పంపిణీ చేయడం అభినందనీయమని ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేణుగోపాల్ నాయుడు అన్నారు. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు పక్కనపెట్టి మట్టితో చేసిన గణేష్ ప్రతిమలను పూజించాలని తెలిపారు . ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ కోశాధికారి రాజేష్, ఈసీ మెంబర్ బాపు రావు , హెచ్ఎండి ఇంజనీర్లు గణేష్, అశి తోష్, తదితరులు పాల్గొన్నారు.
పర్యావరణ పరిరక్షణ కోసం అందరూ కృషి చేయాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES