చిరంజీవి హీరోగా, దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మించారు. నయనతార కథనాయికగా నటిస్తుండగా, అర్చన ఈ సమర్పిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా ఈనెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ అనిల్ రావిపూడి మీడియాతో సంభాషించారు.
ఇప్పటి వరకు టీజర్, ట్రైలర్‌లో ఎక్కడా కూడా రివీల్ చేయని ఒక ఎమోషనల్ పాయింట్ ఈ సినిమాలో ఉంది. కామెడీతో పాటు ఒక బలమైన ఎమోషనల్ రైడ్ ఉంటుంది. చిరంజీవి, నయనతార, పిల్లల మధ్య వచ్చే సన్నివేశాలు చాలా హద్యంగా ఉంటాయి. భార్యాభర్తల మధ్య ఒక సమస్య వచ్చినప్పుడు వాళ్ళు ఎలా దాన్ని హ్యాండిల్ చేస్తారనేది చాలా కొత్త కోణంలో చూపించాం. అది కచ్చితంగా అందరికీ కనెక్ట్ అవుతుంది. ఆ ఎమోషన్ స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు ఇది కరెక్టే కదా అని ఫీల్ అవుతారు.
చిరంజీవి కమ్ బ్యాక్ తర్వాత ‘అన్నయ్య, బావగారు బాగున్నారా, చూడాలని ఉంది’ లాంటి ఫ్యామిలీ జోనర్‌ని ఆయన టచ్ చేయలేదు. ఈ జోనర్‌లో ఆయనకు సినిమా చేయలానే ఆలోచనతో ఈ కథని రెడీ చేశాను.
ఇద్దరు బిగ్ స్టార్స్‌ని బ్యాలన్స్ చేయటం అంటే మామూలుది కాదు. అది సినిమాలో చూస్తారు(నవ్వుతూ). చిరంజీవి, వెంకటేష్ నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. వారి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది. దీంతో నాకు అంతా కేక్ వాక్ అయింది. వారితో కలిసి చేసిన 18 రోజుల షూటింగ్ నా కెరీర్‌లో వెరీ మెమొరబుల్. ఈ సంక్రాంతికి వస్తున్న సినిమాలన్నీ కూడా విజయవంతం కావాలని కోరుకుంటున్నాను తదుపరి సినిమా గురించి ఇంకా ఏమీ అనుకోలేదు. నాగార్జునతో సినిమా చేస్తే నలుగురు అగ్ర కథనాయకులతో సినిమా చేసిన ఈ తరం దర్శకుడిగా రికార్డు నాకే ఉండిపోతుంది (నవ్వుతూ).
అందరూ కనెక్ట్ అవుతారు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



