నవతెలంగాణ – జుక్కల్
జాబ్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికి కూలి పనులు తప్పక కల్పించాలని జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం జుక్కల్ మండలంలోని గుండూరు గ్రామాన్ని ఎంపీడీవో, ఈసీ స్వామి దాస్, స్థానిక గ్రామపంచాయతీ కార్యదర్శితో కలిసి ఉపాధి హామీ పనులు నిర్వహిస్తున్న క్షేత్రస్థాయిలోకి వెళ్లి పనులను పరిశీలించారు. అనంతరం కూలీల హాజరు పట్టికను పరిశీలించారు.
ప్రస్తుతము ఎండలు క్రమంగా రోజురోజుకు పెరుగుతున్న క్రమంలో ఉదయం తొందరగా వచ్చి ఎండలు ఎక్కువ కాకముందే ఉదయం 11 లోపు పనులను ముగించుకోవాలని అన్నారు. ఎండలు ఉన్న సమయంలో పనులు నిర్వహించరాదని కూలీలకు తెలిపారు. అందుకే ఉదయం 6 గంటలకి పని ప్రదేశానికి చేరుకోవాలని వచ్చి సూచించిన కొలతల ప్రకారం ఉపాధి కూలి పనులు నిర్వహించాలని మేట్ కు ఆదేశించారు. ఈ పరిశీలన కార్యక్రమంలో ఎంపీడీవోతో పాటు జిపి కార్యదర్శి, ఎఫ్ఏ వెంకట్ రాథోడ్, మేట్, ఉపాధి హామీ కూలీలు తదితరులు ఉన్నారు.



