Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికి పాలసీ ఉండాలి: కలెక్టర్

అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికి పాలసీ ఉండాలి: కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – వనపర్తి 
సాధారణ ప్రజలకు అతి తక్కువ ప్రీమియంతో అత్యధిక లాభదాయకంగా ఉండే ప్రధానమంత్రి జీవనజ్యోతి భీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష భీమా యోజన పాలసీలను బ్యాంకు అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికి బీమా చేయించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి బ్యాంకర్లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా స్థాయి బ్యాంకర్ల సంప్రదింపులు సమన్వయ సమావేశము జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో PMJJBY, PMSY భీమా కొరకు 246,707 మంది ఖాతాదారులు అర్హులుగా ఉంటే కేవలం 49 శాతం మాత్రమే భీమా చేయించుకోవడం జరిగిందన్నారు. చాలామంది సాధారణ ప్రజలకు ఈ పథకం పట్ల అవగాహన లేదని అలాంటి వారందరికీ ఖచ్చితంగా బీమా చేయించే బాధ్యత బ్యాంకర్లదేనని ఆదేశించారు. సంవత్సరానికి కేవలం 20 రూపాయలు, 436 రూపాయలు చెల్లించడం ద్వారా ఒక్కో బీమా 2 లక్షల విలువ చేస్తుందని, ఇది సాధారణ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. 

బ్యాంకర్ల ద్వారా నిర్వహిస్తున్న ఫైనాన్షియల్ లిటరసీ క్యాంపుల్లో ఈ రెండు ప్రభుత్వ బీమాలు తప్పనిసరిగా చేయించాలని సూచించారు. అదేవిధంగా జిల్లాలో ఖరీఫ్ సీజన్ నడుస్తుందని, రైతులకు వ్యవసాయ పంట రుణాలు, వ్యవసాయ పరికకరముల రుణాలు అత్యధికంగా ఇవ్వాలని ఆదేశించారు. ఈ సంవత్సరం ఇప్పటి వరకు నిర్దేశించిన లక్ష్యం మేరకు వ్యవసాయ రుణాలు ఇవ్వలేదని చెప్పారు. ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రాం కింద జిల్లాలో 32 మంది రుణాల కొరకు దరఖాస్తు చేస్తే ఇప్పటి వరకు కేవలం 4 మంజూరు చేసి మిగిలిన నాలుగు సిజిల్ స్కోర్ లేదని తిరస్కరించారని, మిగిలిన వాటికి త్వరగా గ్రౌండింగ్ చేయాలని ఆదేశించారు. అదేవిధంగా జిల్లాలో మత్స్యకారులకు లక్ష్యం మేరకు రుణాలు మంజూరు చేసి గ్రౌండింగ్ చేయాలని సూచించారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు మహిళా సంఘం నుండి ఒకరిద్దరు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఉండి బ్యాంకు రుణాలకు దరఖాస్తు చేస్తే ఉదారంగా రుణాలు మంజూరు చేయాలని, బిల్లులు పాస్ అయ్యాక తిరిగి చెల్లించడం జరుగుతుందని బ్యాంకర్లను కలెక్టర్ సూచించారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే ప్రకటించిన వార్షిక రుణ ప్రణాళికకు అనుగుణంగా లక్ష్యాలు సాధించేందుకు కృషి చేయాలని బ్యాంకర్లను ఆదేశించారు. ఈ సమావేశంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ శివకుమార్, ఆర్.బి. ఐ ఎల్.డి. ఒ వి. శ్రీనివాస్, నాబార్డ్ డి.డి.యం పి. మోహన్ రెడ్డి, యు .బి.ఐ డిప్యూటీ రీజినల్ మేనేజర్ మురళీకృష్ణ, ఎస్.బి. ఐ చీఫ్ మేనేజర్, వివిధ బ్యాంక్ మేనేజర్లు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad