Tuesday, November 11, 2025
E-PAPER
Homeజాతీయంఅంతా గందరగోళమే

అంతా గందరగోళమే

- Advertisement -

ఎన్యూమరేషన్‌ ఫారంపై తమిళనాడు సీఎం స్టాలిన్‌ వ్యాఖ్యలు

చెన్నై : ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కోసం ఎన్యూమరేషన్‌ ఫారమ్‌లో భారత ఎన్నికల సంఘం కోరిన వివరాలు వివేకవంతులైన ఓటర్లను కూడా గందరగోళానికి గురి చేస్తాయని డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌ వ్యాఖ్యానించారు. సర్‌ ఫారమ్‌ను అందుకున్న స్టాలిన్‌ మాట్లాడుతూ, బంధువుల వివరాలు అంటే తల్లిదండ్రులు, సోదరులు, అక్కా చెల్లెళ్లు, భర్త లేదా భార్య వంటి వారి వివరాలా కాదా అనేది స్పష్టంగా లేదని అన్నారు. ఈ ప్రశ్నపై స్పష్టత ఏమైనా వుందా? బంధువులు అన్న కాలమ్‌లో వారు ఓటర్‌ గుర్తింపు కార్డు నెంబర్‌ అడుగుతున్నారు. మూడో కాలమ్‌లో మళ్ళీ వారు బంధువుల పేర్లు అడుగుతున్నారు. ఎవరి పేరు రాయాలి? బంధువు పేరా లేదా దరఖాస్తుదారు పేరా? ఒక చిన్నపాటి తప్పు జరిగినా ఎన్నికల కమిషన్‌ ఓటర్ల పేర్లు తొలగించే ప్రమాదం వుంది.” అని స్టాలిన్‌ వీడియో సందేశంలో పేర్కొన్నారు.

ఆ వివరాలు కోరడమనేది పెద్ద గందరగోళంలా వుందని ఆయన వ్యాఖ్యానించారు. అయితే సర్‌ ప్రక్రియ పట్ల భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. ఎందుకంటే ఈ బాధ్యత మొత్తం నిర్వహిస్తున్నది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులేనని చెప్పారు. ”అయితే ప్రభుత్వ ఉద్యోగి ఎన్నికల కమిషన్‌ నియంత్రణలో వుంటారు, ఆ ఉద్యోగి రాష్ట్ర ప్రభుత్వానికి జవాబుదారీ కాదు. ఇది వాస్తవం.” అని చెప్పారు.
తానేమీ సరÊను వ్యతిరేకించడం లేదని మరోసారి స్టాలిన్‌ స్పష్టం చేశారు. ఎందుకంటే స్వేచ్ఛగా, సక్రమంగా ఎన్నికలు జరగాలంటే నిజాయితీ, పారదర్శకతతో కూడిన ఓటర్ల జాబితా చాలా అవసరమని వ్యాఖ్యానించారు. అయితే ఆ జాబితాను హడావిడిగా నిర్వహించరాదన్నది తమ వైఖరి అని స్పష్టం చేశారు. కేంద్రంలోని పాలక బీజేపీ ఎన్నికల కమిషన్‌ సాయంతో ఓటర్ల జాబితాలో ఎలా తీవ్రమైన మోసాలకు పాల్పడిందో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ విశదీకరించారని చెప్పారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇరువురూ సర్‌కు వ్యతిరేకమేనని చెప్పారు.

సరÊ ప్రారంభమైనప్పటి నుంచి ఎదుర్కొంటున్న సమస్యలను పార్టీ నాయకత్వం దృష్టికి డీఎంకే సభ్యులు తీసుకువచ్చారన్నారు. బూత్‌ స్థాయి అధికారులు (బీఎల్‌ఓ) ఇండ్లకు వెళ్లడం లేదని, ఒకవేళ వెళ్ళినా వారి వెంట తగినన్ని ఫారాలు తీసుకెళ్ళడం లేదని చెప్పారు. ఒక నియోజకవర్గంలో మూడు లక్షలకు పైగా ఫారాలను ఈఆర్‌ఓ (ఓటరు నమోదు అధికారి) ఎలా పంపిణీ చేస్తారని, ఈ ప్రక్రియను మొత్తంగా ఎలా పూర్తి చేస్తారని స్టాలిన్‌ ప్రశ్నించారు. డిసెంబరు 7 న ముసాయిదా జాబితా విడుదల చేస్తామని ఎన్నికల కమిషన్‌ చెబుతోంది. కానీ ఆలోగా ఇది పూర్తవుతుందా అనే ఒక అనిశ్చితి కూడా నెలకొంది. డీఎంకే, మిత్రపక్షాలు భయాందోళనలు కూడా ఇవే. జాబితా నుంచి పెద్ద సంఖ్యలో ఓటర్లను తొలగించే ప్రమాదం వుందని..అందువల్ల డీఎంకే సభ్యులు అప్రమత్తంగా వుండాలని స్టాలిన్‌ కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -