Tuesday, December 2, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం

పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం

- Advertisement -

నవతెలంగాణ – భీంగల్
మూడవ ఫేస్లో జరగబోయే GP ఎన్నికలకు మంగళవారం ఎంపీడీవో కార్యాలయంలో జిపి ఎన్నికల సందర్భంగా ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్ మీడియా ప్రిపరేటరీ ముందస్తు సమావేశం నిర్వహించారు. అధికారులకు కరాదీపక ద్వారా శిక్షణ ఇవ్వడం జరిగింది భీంగల్ మండలంలోని 27 గ్రామపంచాయతీలో మూడోదశ ఎన్నికలు నిర్వహించవలసి ఉన్నందున ఏర్పాట్లు పూర్తిఅయ్యాయని అన్నారు. రిటర్నింగ్ అధికారులు మొత్తం ఏనామీది 8 గ్రామపంచాయతీలలో నామినేషన్ కౌంటర్లు ఏర్పాటు చేసి 27 గ్రామ పంచాయతీలకు సంబంధించి ఆయా గ్రామాల్లో నామినేషన్ స్వీకరణ జరుగుతుందని ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్ తెలిపారు.

ఈ నామినేషన్ ప్రక్రియ కోసం పోటీ చేసే అభ్యర్థులు తగిన పత్రాలను జతపరిచి, గ్రామ పంచాయతీలో రిజర్వేషన్లు వివరాలు ఓటర్ లిస్ట్ అందుబాటులో ఉన్నందున పోటీ చేసే అభ్యర్థులు వాటిని వినియోగించుకోవాలని కోరడం జరిగింది. ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయుటకు సిబ్బంది అత్యంత సిద్ధంగా ఉందని ఎంపీడీవో తెలపడం జరిగింది. మండలంలోని మేజర్ గ్రామపంచాయతీలలో నామినేషన్ దాఖలు చేయలని ఈ సందర్భంగా పోటీ చేసే అభ్యర్థులకు వివరించారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద హెల్ప్ లైన్ నెంబర్ చేకూర్చామని, ఏదైనా సమస్య ఉన్న, సూచనలు కావాలన్నా 24 గంటలు హెల్ప్ లైన్ నంబర్ ను సంప్రదించావచ్చని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -