- Advertisement -
నవతెలంగాణ – కాటారం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ఐటి మినిస్టర్ స్వగ్రామం ధన్వాడలో పారిశుద్ధ్యం పడకేసింది. గ్రామంలో గత మూడు రోజుల క్రితం విద్యుత్ అధికారులు తీగలకు ఆనుకొని అడ్డుగా ఉన్న చెట్టు కొమ్మలను తొలగించారు. అయితే తొలగించిన చెట్టు కొమ్మలను రోడ్డుపై అలాగే వదలి వెళ్ళిపోయారు. స్వయానా ఐటీ మినిస్టర్ దుద్దిల్ల శ్రీధర్ బాబు గ్రామంలోనే అధికారులు ఇంత నిర్లక్ష్యం వహిస్తుంటే మిగతా గ్రామాలలో అధికారుల పనితీరు ఏ విధంగా ఉంటుందోనని పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం గ్రామపంచాయతీ అధికారులైనా స్పందించి చెట్టు కొమ్మలను అక్కడినుండి తొలగించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
- Advertisement -

                                    

