Wednesday, July 9, 2025
E-PAPER
Homeసినిమాఅద్భుతమైన రెస్పాన్స్‌

అద్భుతమైన రెస్పాన్స్‌

- Advertisement -

హీరో సిద్ధార్థ్‌ నటించిన చిత్రం ‘3 బీహెచ్‌కె’. శ్రీ గణేష్‌ దర్శకత్వం వహించారు. శరత్‌ కుమార్‌ , దేవయాని, యోగి బాబు, మీతా రఘునాథ్‌, చైత్ర కీలక పాత్రల్లో నటించారు. శాంతి టాకీస్‌ బ్యానర్‌పై అరుణ్‌ విశ్వ నిర్మించిన చిత్రం ఇటీవల విడుదలై ఘన విజయాన్ని అందుకొని, సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్‌ థ్యాంక్యూ ప్రెస్‌మీట్‌ని నిర్వహించారు.
హీరో సిద్ధార్థ్‌ మాట్లాడుతూ,’ఈ సినిమా ప్రేక్షకులకు చేరిందంటే దానికి కారణం మీడియా. ఒక స్వీట్‌ ఫిల్మ్‌ని ఆడియన్స్‌ దగ్గరికి చేరవేశారు. ఆడియన్స్‌ నుంచి చాలా అద్భుతమైన రెస్పాన్స్‌ ఉంది. ఒక క్లాసిక్‌ సినిమాకి ఉండాల్సిన క్వాలిటీస్‌ అన్ని ఈ సినిమాకి ఉన్నాయి. ఈ సినిమాలో పార్ట్‌ కావడం గర్వంగా ఉంది. ఈ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్లో స్క్రిప్టు చదివిన వెంటనే మా నాన్నగారిని కౌగిలించుకున్నాను అని చెప్పాను. తర్వాత ఇందులో ఉండే ఎలిమెంట్స్‌ అన్ని రిలేట్‌ చేసుకునేలాగా ఉంటాయని అన్నాను. ఆ రెండింటిని ఆడియన్స్‌ ఈరోజు ఎక్స్‌పీరియన్స్‌ చేస్తున్నారు. ఈ కథ ప్రతి ఒక్కరికీ కనెక్ట్‌ అవుతుంది. ఈ సినిమా చూసిన అందరూ కూడా చాలా అద్భుతంగా ఉందని మెసేజ్‌లు పెడుతుంటే చాలా ఆనందంగా అనిపించింది. గెలుపు మన దగ్గరికి వచ్చేటప్పుడు ఆ సంతప్తి వేరు. అలాంటి ఆనందాన్ని డైరెక్టర్‌ శ్రీ గణేష్‌ ఈ సినిమాలో చూపించాడు. ఓడిపోవడం పర్మినెంట్‌ కాదని డైరెక్టర్‌ ఈ సినిమాతో చాలా అద్భుతంగా చూపించాడు. ఈ సినిమాకి రెండో రోజు నుంచి ఫ్యామిలీ ఆడియన్స్‌ నుంచి చాలా అద్భుతమైన రెస్పాన్స్‌ ఉంది. మేము ఏపీ, తెలంగాణలో థియేటర్స్‌ విజిట్‌ చేయబోతున్నాం. ఫస్ట్‌ వీక్‌ తర్వాత ఇంత క్రౌడ్‌ చూడడం బ్యూటీఫుల్‌ ఎక్స్‌పీరియన్స్‌. ఈ సినిమాని రిలీజ్‌ చేసిన మైత్రి మూవీ మేకర్స్‌కి చాలా థ్యాంక్స్‌’ అని అన్నారు.
‘ఈ సినిమాకి చాలా గొప్ప రివ్యూస్‌ వచ్చాయి. మంచి సినిమాని తీయడం ఒక ఎత్తు ఆ సినిమాని జనాల దగ్గరికి తీసుకెళ్లడం మరో ఎత్తు. ఈ విషయంలో మీడియా వారందరికీ కతజ్ఞతలు. తెలుగు ప్రేక్షకులు మంచి సినిమాని ఆదరిస్తారని ఈ సినిమాతో మరోసారి రుజువైంది. ఫ్యామిలీ ఆడియన్స్‌ సినిమాని చాలా ఎంజారు చేస్తున్నారు. మీరందరూ మా గహప్రవేశానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది (నవ్వుతూ). విశ్వ ఎక్స్‌లెంట్‌ ప్రొడ్యూసర్‌. శ్రీ గణేష్‌ అద్భుతమైన ఫ్యామిలీ సినిమా ఇచ్చాడు’ అని నటి దేవయాని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -