నవతెలంగాణ -పెద్దవంగర
మండల కేంద్రంలోని వైన్స్ షాపును ఎక్సైజ్ సీఐ అశోక్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. షాపులో మద్యం అమ్మకాల రికార్డులు, నిల్వల వివరాలు, మద్యం క్వాలిటీ, లైసెన్స్ నిబంధనలను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్యం షాపు నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలు పాటించాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మైనర్లకు మద్యం విక్రయం చేయకూడదని, నిర్ణీత సమయాలకు మించి అమ్మకాలు జరపరాదని సూచించారు. అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం ఉన్నట్లయితే స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. వ్యాపారులు ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సీఐ సూచించారు. కార్యక్రమంలో పెద్దవంగర ఎస్సై చిలువేరు ప్రమోద్ కుమార్ గౌడ్, ఎక్సైజ్ పోలీసులు మధుకర్, సత్య ప్రసాద్, మధార్ ఖాన్ పాల్గొన్నారు.



