నవతెలంగాణ – కంఠేశ్వర్
నిజామాబాద్ నగరంలోని బబన్స పహాడ్ లో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పట్టుకున్నారు. నిజామాబాద్ ఎక్సైజ్ ఎన్ఫోసిమెంట్ సిఐ వెంకటేష్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి ఆదేశాల మేరకు ఎన్ఫోర్స్మెంట్ టీం ఏ ఈ ఎస్ సిహెచ్. విలాస్ కుమార్ ఆధ్వర్యంలో వెంకటేష్, బాలకిషన్ తమ సిబ్బందితో శుక్రవారం రాత్రి నగరంలోని బాబన్స పహాడ్ ఏరియాలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో ఒక వ్యక్తి రెండు గంజాయి బైక్పై తరలిస్తుండగా అదుపులోకి తీసుకున్నామన్నారు. అమీర్ ఖాన్ అనే వ్యక్తి వద్ద నుండి 260 గ్రాముల ఎండు గంజాయి స్వాధీనం చేసుకుని ఒక ద్విచక్ర వాహనా న్ని సెల్ఫోన్లో స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎండు గంజాయి ఎవరైనా అమ్మిన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ దాడుల్లో ఎస్ఐ నరసింహ చారి, సిబ్బంది భోజన, విష్ణు, భూమన్న, రాజన్న, సాయికుమార్, శ్యాంసుందర్, అవినాష్, రామ్ బచ్చన్, గంగారం, తదితరులు పాల్గొన్నారు.
ఎండు గంజాయిని పట్టుకున్న ఎక్సైజ్ పోలీసులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



