Wednesday, November 26, 2025
E-PAPER
Homeతాజా వార్తలుసీనియర్ టీచర్లకు TET మిన‌హాయించండి.. ఎంపీ ఈటల రాజేంద‌ర్‌కు TSUTF విన‌తి ప‌త్రం

సీనియర్ టీచర్లకు TET మిన‌హాయించండి.. ఎంపీ ఈటల రాజేంద‌ర్‌కు TSUTF విన‌తి ప‌త్రం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: సీనియర్ టీచర్లకు TET నుండి మినహాయింపు ఇచ్చి వారి ఉద్యోగాలకు రక్షణ కల్పించాలని TSUTF రాష్ట్ర కమిటీ కోరింది. ఈ మేర‌కు బుధ‌వారం ఎంపీ ఈటెల రాజేందర్‌ని కలిసి TSUTF రాష్ట్ర కమిటీ స‌భ్యులు వినతి పత్రం అందజేశారు. పార్లమెంటులో చట్ట సవరణ ద్వారా త‌మ‌కు న్యాయం చేయాల‌ని ఎంపీని కోరారు. ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ పాతిక, ముప్పై సంవత్సరాల సర్వీసు చేశాక ఇప్పుడు అర్హత పరీక్ష వ్రాయాలనటం అర్థరహితమని, కేంద్ర ప్రభుత్వంతో చర్చించి మినహాయింపు కోసం తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో STFI ప్రధాన కార్యదర్శి, TSUTF అధ్యక్షుడు చావ రవి, TSUTF కోశాధికారి టి లక్ష్మారెడ్డి, VOTT ప్రధాన సంపాదకులు పి మాణిక్ రెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె జయసింహారెడ్డి, ఎం మదన్ రెడ్డి, జిల్లా నాయకులు మహిపాల్ రెడ్డి, కుమారస్వామి, పురుషోత్తమ్, శ్రీనివాస్, కుమార్, స్వప్న, బంటు రాజు, హరేరామ్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -