– కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్,
– జాయింట్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్
– భగత్‌నగర్‌లో స్టార్ ఫిట్ నెస్ జిమ్ ప్రారంభం
నవతెలంగాణ – కరీంనగర్
ఆరోగ్యానికి వ్యాయామం తప్పక అవసరమని కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, జాయింట్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్ అన్నారు. నగరంలో గురువారం స్థానిక భగత్ నగర్ లోని స్టార్ ఫిట్నెస్ జిమ్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా వచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రోజుల్లో జంక్ ఫుడ్, కల్తీ ఫుడ్ తిని అనేకమంది ఊబకాయం, అనారోగ్యానికి గురవుతున్నారని, ఇప్పుడున్న పరిస్థితుల్లో జిమ్, వ్యాయామం ప్రతి ఒక్కరికి అవసరమని అన్నారు. రోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనుషులు తమ తమ పనుల్లో బిజీగా ఉన్నారని, ఎంత బిజీగా ఉన్నప్పటికీ వ్యాయామం అనేది రోజువారి టైం టేబుల్ లో ఉండాలని అన్నారు. అప్పుడే ఆరోగ్యంగా ఉండగలుగుతామని అన్నారు. స్టార్ జిమ్ యాజమాన్యం మాట్లాడుతూ అత్యాధునిక టెక్నాలజీతో కరీంనగర్ పట్టణంలో తక్కువ ఫీజుతో మూడు నెలల ప్యాకేజీ ఆరు నెలల ప్యాకేజీ పెట్టామని, అనుభవాలు అయిన ట్రైనర్లతో శిక్షణ ఇప్పిస్తామని అన్నారు. కరీంనగర్ ప్రజలు స్టార్ జిమ్ ను సందర్శించి తమకు నచ్చితే అడ్మిషన్ పొందాలని విజ్ఞప్తి చేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో గుడికందుల సత్యం, వర్ణ వెంకటరెడ్డి, జి సంధ్య, గుడి కందుల సింధు, యు. శ్రీనివాస్ బీమా సాహెబ్ రాంపల్లి తిరుపతి, పోలోజు కృష్ణ, అనిల్,ఆర్ శ్రీనివాస్, శ్రీధర్ ఆచారి, సిరి తదితరులు పాల్గొన్నారు.
ఆరోగ్యానికి వ్యాయామం తప్పక అవసరం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES