Monday, December 8, 2025
E-PAPER
Homeకరీంనగర్నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి

నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి

- Advertisement -
  • ఎస్పీ మహేష్ బి.గితే.
    నవతెలంగాణ-రాజన్న సిరిసిల్ల:
    స్వేచ్ఛాయుతంగా, శాంతియుతంగా పంచాయతీ ఎన్నికలు జరిగేందుకు,ప్రతి ఓటరు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేల,ఎన్నికల నియమవళిపై ప్రజల్లో చైతన్యం పెంపొందించేందుకు పోలీసు యంత్రాంగం గ్రామాల్లోకి వెళ్లి ప్రజలతో మమేకం అవుతూ ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారని జిల్లా ఎస్పీ మహేష్ బి. గీతే అన్నారు. పలు గ్రామాలు తనిఖీలు చేసిన ఆయన మాట్లాడుతూ..ప్రజలు పోలీసులకు సహకరిస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశించిన ఎన్నికలు నియమావళి పాటిస్తూ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.ఓటర్లను ప్రలోభ పెట్టడానికి డబ్బులు,మద్యం,ఇతర విలువైన వస్తువులు తీసుకొని వెళ్తున్నట్లు సమాచారం ఉంటే సంబంధిత పోలీస్ స్టేషన్ వారికి సమాచారం అందించాలని సూచించారు. జిల్లాలో మూడు విడతల్లో గ్రామ పంచాయితీ ఎన్నికలను ప్రశాంత,శాంతియుత వాతావరణంలో,ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా,ప్రజలు భయాందోళనకు గురికాకుండా తమ ఓటు హక్కును స్వేచ్ఛయూత వాతావరణంలో వినియోగించుకునేందుకు అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశామ‌న్నారు. ఎన్నికలను శాంతియుత వాతావరణం నిర్వహించేందుకు 800 మంది పోలీస్ సిబ్బంది సంసిద్దంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు.
    శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడిన, రెచ్చగొట్టే మాటాలతో శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన ఎన్నికల నియమావళి ప్రకారం చట్ట రీత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పీ వివరించారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -