నవతెలంగాణ-హైదరాబాద్: తుర్కియే లో నిమిషాల్లోనే ఓ లగ్జరీ నౌక సముద్రంలో మునిగిపోయింది. ప్రసిద్ధ పర్యాటక ప్రదేశమైన జోంగుల్డక్ తీరంలో మెడ్ యిల్మాజ్ షిప్‌యార్డ్‌లో మంగళవారం ఈ నౌక్‌ను గ్రాండ్‌గా ప్రారంభించారు. కొంత మంది ప్రయాణికులు, సిబ్బందితో నౌక సముద్రంలో తన ప్రయాణాన్ని ప్రారంభించింది. అయితే, ప్రారంభమైన 15 నిమిషాలకే ఈ నౌక సముద్రంలో మునిగిపోయింది. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. నౌక మునిగిపోతున్న దృష్యాలు అక్కడే ఒడ్డున ఉన్న కొందరు తమ కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది. దాదాపు 1 మిలియన్ డాలర్లతో ఈ లగ్జరీ నౌకను నిర్మించారు. దీని ఖరీదు భారత కరెన్సీలో దాదాపు 8.74 కోట్లన్నమాట. 24 మీటర్ల పొడవున్న ఈ లగ్జరీ నౌకకు డోల్స్ వెంటో () అని పేరు పెట్టారు.
15 నిమిషాలకే నీటమునిగిన ఖరీదైన నౌక
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES