మైథలాజికల్, సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్‌గా ‘యముడు’ అనే చిత్రాన్ని జగన్నాధ పిక్చర్స్ పతాకంపై జగదీష్ ఆమంచి హీరోగా నటిస్తూ, స్వీయ దర్శకత్వం వహించారు.
ఈ సినిమాకు ‘ధర్మో రక్షతి రక్షితః’ అనేది ఉప శీర్షిక. ఈ చిత్రంలో శ్రావణి శెట్టి హీరోయిన్‌గా నటించారు. సోమవారం ఈచిత్ర ఆడియో లాంచ్ ఈవెంట్‌ను మేకర్స్ ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో మొదటి పాటను ప్రియాంక, మల్లిక సంయుక్తంగా లాంచ్ చేయగా, రెండో పాటను నిర్మాత బెక్కెం వేణుగోపాల్ రిలీజ్ చేశారు. మూడో పాటను కే మ్యూజిక్ సీఈవో ప్రియాంక, నాలుగో పాటను మల్లిక విడి విడిగా రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ,’ప్రతీ ఏడాది వందల చిత్రాలు వస్తుంటాయి. అందులో కొంత మందికి మాత్రమే సక్సెస్ వస్తుంది. చిన్న చిత్రాలు ఈ మధ్య వండర్లు క్రియేట్ చేస్తున్నాయి. అలా ఈ ‘యముడు’ చిత్రం పెద్ద విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది. జగదీష్ ఎన్నో కష్టాల్ని ఎదుర్కొని హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా మారి ఈ సినిమాను తీశారు. మొదటి చిత్రాన్నే ఇంత ప్రయోగాత్మాకంగా తీయడం గొప్ప విషయం. భవానీ ఇచ్చిన సంగీతం బాగుంది. ఈ మూవీతో చాలా మంది కొత్త ఆర్టిస్టులు, టెక్నీషియన్లు పరిచయం కాబోతున్నారు. శ్రావణి శెట్టికి సరైన బ్రేక్ రావాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. ‘ప్రస్తుతం ఎక్కడ చూసినా కుట్రలు, హత్యలు, అక్రమ సంబంధాలకు సంబంధించిన వార్తలే కనిపిస్తున్నాయి. ఆ పాయింట్‌లతోనే ఈ చిత్రాన్ని తీశాం. అందరినీ ఆకట్టుకునేలా మా చిత్రం ఉంటుంది’ అని హీరో, దర్శకుడు, నిర్మాత జగదీష్ ఆమంచి చెప్పారు.
ప్రయోగాత్మకంగా ‘యముడు’
- Advertisement -
- Advertisement -